Share News

తుఫాన్‌ ఎఫెక్ట్‌ ... పలు రైళ్లు రద్దు

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:17 AM

సామర్లకోట/ రాజమహేంద్రవరం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ఈదురు గాలులు, భారీవర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విశాఖ నుంచి సామర్లకోట మీదుగా రాకపోకలు సాగించే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను 3రోజుల బాటు తాత్కాలికంగా రద్దు చేసినట్టు

తుఫాన్‌ ఎఫెక్ట్‌ ... పలు రైళ్లు రద్దు

రైల్వే స్టేషన్లలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌లు

రైల్వే యంత్రాంగం జాగ్రత్త చర్యలు

సామర్లకోట/ రాజమహేంద్రవరం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ఈదురు గాలులు, భారీవర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విశాఖ నుంచి సామర్లకోట మీదుగా రాకపోకలు సాగించే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను 3రోజుల బాటు తాత్కాలికంగా రద్దు చేసినట్టు రైల్వే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైళ్ల రద్దు, ఆలస్యం, రిజర్వేషన్‌ టిక్కెట్ల విషయాలు ప్రయాణికులు తెలుసుకు నేందుకు విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో 9 హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట రైల్వే స్టేషన్‌తో సహా రాజమహేంద్రవరం, కాకినాడ టౌన్‌ స్టేషన్లలో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పా టుచేసి నిరంతరం సమాచారాన్ని అంది వ్వనున్నట్టు తెలిపారు. సామర్లకోట రైల్వే స్టేషన్‌లో 7382383188, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో 8331987657, కాకినాడ టౌన్‌ రైల్వే స్టేషన్‌లో 0884-2374227 నంబర్లకు ఫోన్‌ చేసి రైల్వే సమాచారాన్ని తెలుసుకోవచ్చని రైల్వే సూపరింటెండెంట్‌ ఎం.రమేష్‌ తెలిపారు.

రద్దయిన రైళ్లు ఇవే

విశాఖ-విజయవాడ మధ్య సామర్లకోట స్టేషన్‌మీదుగా రాకపోకలు సాగించే పలు ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్టు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. ఈ నెల 28 మంగళవారం రైలు నెం.67285, 67286 రాజమండ్రి-విశాఖ-రాజమండ్రి మెము, 17268, 17267 విశాఖ-కాకినాడ-విశాఖ, 08583/84 విశాఖ-తిరుపతి-విశాఖ, 22875/76 విశాఖ-గుం టూరు-విశాఖ డబుల్‌ డెకర్‌, 22707 విశాఖ- తిరుపతి డబుల్‌ డెకర్‌, 17243/44 గుంటూ రు-రాయగడ-గుంటూరు, 17220 విశాఖ- మచిలీ పట్నం, 12727 విశాఖ-హైదరాబాద్‌, 12861 విశా ఖ-మహబూబ్‌నగర్‌, 12862 మహబూబ్‌నగర్‌- విశాఖ(28న), 22869 విశాఖ- చెన్నై వీక్లీ, 127 39న విశాఖ-సికింద్రాబాద్‌, 20805 విశాఖ-ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌, 22707 విశాఖ-తిరుపతి వీక్లీ డబుల్‌ డెకర్‌, 18519 విశాఖ-ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లను రానుపోను రైళ్లను రద్దు చేశారు.

14 రైళ్లు పునరుద్ధరణ

తుఫాను కారణంగా విజయవాడ రైల్వే ఉన్నతాధికారులు 14 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించినప్పటికీ సోమవారం పునరుద్ధరిం చినట్లు రైల్వే డిప్యూటీ సీవోఎం సందీప్‌కుమార్‌ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 08583 విశాఖ- తిరుపతి, 22707 విశాఖ- తిరుపతి డబుల్‌ డెక్కర్‌, 17243 గుంటూరు- రాయగడ, 17244 రాయగడ-గుంటూరు, 17220 విశాఖ-మచిలీపట్నం, 12727 విశాఖ- హైదరా బాద్‌, 12861 విశాఖ- మహబూబ్‌నగర్‌, 22869 విశాఖ-మద్రాసు వారాంతపు ఎక్స్‌ప్రెస్‌, 12739 విశాఖ-సికింద్రాబాద్‌, 20805 విశాఖ-న్యూడిల్లీ, 22707 విశాఖ-తిరుపతి వారాంతపు డబుల్‌ డెక్కర్‌, 18519 నంబరు గల విశాఖ-ఎల్టీటీ రైళ్లు పునరుద్ధరించిన వాటిలో ఉన్నట్టు పేర్కొన్నారు. 20806 నంబరు గల న్యూడిల్లీ-విశాఖ, 18520 నంబరు గల ఎల్టీటీ-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు ఈనెల29న యథావిధిగా బయలుదేరనున్నాయి.

Updated Date - Oct 28 , 2025 | 12:17 AM