Share News

కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:19 AM

జీజీహెచ్‌ (కాకినాడ), అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఫిమేల్‌ ఆర్థో వార్డులో 49 పడకల సామర్థ్యంతో తుఫాను ప్రభావంతో ప్రమాదాలు జరిగితే ఈ వార్డును వినియో

కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు
ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు

జీజీహెచ్‌ (కాకినాడ), అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఫిమేల్‌ ఆర్థో వార్డులో 49 పడకల సామర్థ్యంతో తుఫాను ప్రభావంతో ప్రమాదాలు జరిగితే ఈ వార్డును వినియోగించేందుకు ఏర్పాటు చేశారు. అన్ని మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య బృందం, నిరంతరప్రాయంగా వైద్య సేవలు అందించేందుకు పలు విభాగాల వైద్య నిపుణులు, వైద్యేతర సిబ్బంది విధులు నిర్వర్తించే విధంగా జీజీహెచ్‌ ఆసుపత్రి అధికారులు చర్యలు చేపట్టారు.

Updated Date - Oct 28 , 2025 | 12:19 AM