Share News

మొంథా.. ముందుగానే నీటి విడుదల!

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:14 AM

ఏలేశ్వరం/పిఠాపురం/గొల్లప్రోలు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ఏలేరు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలను సోమవారం సాయంత్రం 6గంటలు నుంచి 5వేల క్యూసెక్కులకు పెంచారు. ఇన్‌ఫ్లోస్‌ సాధారణంగా ఉన్నప్పటికి మొంథా తుఫాన్‌ కారణంగా భా

మొంథా.. ముందుగానే నీటి విడుదల!
డొంకరాయి జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

తుఫాన్‌ కారణంగా భారీ వర్ష సూచన

ఏలేరు రిజర్వాయర్‌ నుంచి 5వేల క్యూసెక్కుల నీరు విడుదల

ఏలేశ్వరం/పిఠాపురం/గొల్లప్రోలు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ఏలేరు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలను సోమవారం సాయంత్రం 6గంటలు నుంచి 5వేల క్యూసెక్కులకు పెంచారు. ఇన్‌ఫ్లోస్‌ సాధారణంగా ఉన్నప్పటికి మొంథా తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో దిగువకు నీటిని అధికంగా విడుదల చేస్తున్నారు. ఏలే రు రిజర్వాయర్‌ నుంచి సోమవారం ఉదయం 6గంటలకు వరకూ 3175 క్యూసెక్కుల నీటిని విడుదల చేయ గా, 500 క్యూసెక్కుల వంతున పెంచుకుంటూ సాయంత్రానికి 5,175 క్యూసెక్కులకు పెంచారు. స్పిల్‌వే ద్వారా 4,400 క్యూసెక్కులు, డీసీఆర్‌ స్లూయిజ్‌ ద్వారా 600 క్యూసెక్కులు వెరసి 5వేల క్యూసెక్కులకు కాలువలకు విడుదల చేస్తున్నారు. విశాఖ అవసరాల నిమిత్తం 175 క్యూసెక్కుల నీటిని పంపుతున్నారు. ఇన్‌ ఫ్లోస్‌ 1700 క్యూసెక్కులు మాత్రమే ఉన్నాయి. ఇన్‌ఫ్లోస్‌ కంటే మూడు రెట్లు అధికంగా అవుట్‌ఫ్లోస్‌ ఉండడంతో ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు 21.90 టీఎంసీలకు తగ్గగా, నీటిమట్టం 85.47మీటర్లుగా ఉంది. తుఫాన్‌ ప్రభావంతో క్యాచ్‌మెంట్‌ ఏరియాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఇన్‌ఫ్లోస్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో అవుట్‌ఫ్లోస్‌ పెంచినట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.

అత్యంత అప్రమత్తం

ఏలేరు నుంచి 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట, ప్రత్తిపాడు, ఏలేశ్వరం తదితర మండలాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి అనుగుణంగా రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు సమాచారం ఇస్తున్నారు.

డొంకరాయి జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కులు..

మోతుగూడెం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి 15వేల క్యూసెక్కుల నీటిని జెన్‌కో అధికారులు సోమవారం విడుదల చేశారు. మొం థా తుఫాన్‌లో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా డ్యాం సేప్టీ అధికార్ల ఆదేశాల మేరకు జలాశ యం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్టు సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో సీఈ రాజారావు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడు గులు కాగా ఇటీవల ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతంలో ఉన్న వలస గెడ్డ, పాలగెడ్డ, మంగంపాడు తదితర చోట్ల నుంచి భారీగా వరద నీరు వచ్చి జలాశయంలోకి రావ డంతో నీటి మట్టం 1036.50 అడుగులకు చేరుకుంది. నీటి మట్టాన్ని తగ్గించే చర్యల్లో భాగంగానే 15వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం జలాశయానికి 10 వేల నుంచి 12వేలు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నాయని, నీటి విడుదల నేపథ్యంలో జలా శ యం దిగువున ఉన్న ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. కాం ప్లెక్సు పరిధిలోని జోలాపుట్‌, సీలేరు జలాశయాల వద్ద కూ డా జెన్‌కో అధికారులను అప్ర మత్తం చేసి ఎప్పటికప్పుడు వరద నీటిని పర్యవేక్షించి చర్య లు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

Updated Date - Oct 28 , 2025 | 12:14 AM