Share News

తుఫాన్‌ హెచ్చరికలు.. రత్నగిరిపై భక్తుల రక్షణకు చర్యలు

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:16 AM

అన్నవరం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచనలతో అన్నవరం దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. కార్తీకమాసం సందర్భంగా భక్తులకు ఎండా, వానల నుంచి రక్షణ

తుఫాన్‌ హెచ్చరికలు.. రత్నగిరిపై భక్తుల రక్షణకు చర్యలు
భక్తులకు రక్షణగా ఏర్పాటు చేసిన రేకులను పటిష్టం చేస్తున్న అధికారులు

అన్నవరం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచనలతో అన్నవరం దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. కార్తీకమాసం సందర్భంగా భక్తులకు ఎండా, వానల నుంచి రక్షణగా పలు కూడళ్లలో రేకులషెడ్డులు వేసి క్లాత్‌ డెకరేట్‌ చేశారు. అయితే అవి గాలులుకు ఎగిరిపోకుండా పటిష్టమైన తాళ్లతో బిగిం చి జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు ఎక్కడా ఎక్కు వసేపు నిల్చోవద్దని మైక్‌ ద్వారా ప్రచారం గావించారు. దర్శనాలు, వ్రతాలు పూర్తయిన వారు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలంటూ ప్రచారం చేశారు.

తగ్గిన భక్తుల తాకిడి

అన్నవరం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మొ ంథా తుఫాన్‌ ప్రభావం సత్యదేవుడి ఆలయంపై పడింది. కార్తీకమాసం సోమవారం పర్వదినమై నా భక్తులు సందడి పెద్దగా కనిపించలేదు. ఉద యం 10గంటలకే ఆలయప్రాంగణం ఖాళీ అయి పోయింది. సోమవారం సుమారు 4వేల వ్రతా లు జరుగుతాయని అధికారులు అంచనా వేసి నా కేవలం 2వేలు మాత్రమే జరిగాయి. కార్తీకమాసం ప్రత్యేక అధికారులుగా నియమించిన డిప్యూటీ కమిషనర్‌ రమేష్‌బాబు, తలుపులమ్మ ఆలయ ఈవో విశ్వనాథరాజు, చైర్మన్‌ రోహిత్‌లు కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి క్యూలైన్‌లు, రద్దీ నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. దేవస్థానం ఈవో సుబ్బారావు ప్ర ధానాలయం, ఇతర ప్రాంతాల్లో పర్యటించారు.

Updated Date - Oct 28 , 2025 | 12:16 AM