Share News

మోక్షగుండం.. నోబుల్‌ ఇంజనీర్‌

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:47 AM

నీటి పారుదల రంగంలో విశేష కృషి చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశాభివృద్ధికి దారి చూపిన నోబుల్‌ ఇంజనీర్‌ అని ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ కె.గోపినాథ్‌ కొనియాడారు. గోదావరిపై ఆనకట్ట నిర్మాణంలో విశేష సేవలందించిన నోబుల్‌ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్లు ఘనంగా నిర్వహించారు.

మోక్షగుండం.. నోబుల్‌ ఇంజనీర్‌
ధవళేశ్వరంలోని ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఇరిగేషన్‌ ఇంజనీర్లు

  • ఇరిగేషన్‌ ఎస్‌ఈ గోపినాథ్‌

  • ఘనంగా ఇంజనీర్స్‌ డే

  • విశ్వేశ్వరయ్యకు ఘన నివాళి

ధవళేశ్వం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నీటి పారుదల రంగంలో విశేష కృషి చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశాభివృద్ధికి దారి చూపిన నోబుల్‌ ఇంజనీర్‌ అని ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ కె.గోపినాథ్‌ కొనియాడారు. గోదావరిపై ఆనకట్ట నిర్మాణంలో విశేష సేవలందించిన నోబుల్‌ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్లు ఘనంగా నిర్వహించారు. నీటి పారుదల శాఖ కార్యాలయాల వద్ద పార్కు లో ఉన్న విశ్వేశ్వరయ్య విగ్రహానికి సోమవారం ఉదయం ఎస్‌ఈ గోపినాథ్‌ ఇంజనీర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణరాజ సాగర్‌ డ్యాం నిర్మాణంలో తన ప్రతిభను చాటడంతో పాటు ఆటోమేటిక్‌ స్లూయిజ్‌ గేట్ల రూపకల్పనతో వ్యవసాయానికి అనుకూలంగా నీటి నియంత్రణ సాధ్యమయ్యేలా ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. నేటి ఇంజనీర్లు ఆయన బాటలో రాష్ట్ర దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమం లో హెడ్‌వర్క్స్‌ ఈఈ జి.శ్రీనివాసరావు, డీఈ ఆనంద్‌కుమార్‌, ఏఈలు విశ్వనాధరాజు, మణికంఠరాజు, సునీల్‌, జేఈ రాధాకృష్ణ తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:47 AM