Share News

రైతుల బాధలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తా

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:29 AM

మలికిపురం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌ పొంగి లక్షలాది కొబ్బరిచెట్లు చనిపోయి తీర ప్రాంత గ్రామాల్లోని రైతులు పడుతున్న బాధలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా ప్రయత్నిస్తానని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికి

రైతుల బాధలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తా
కేశనపల్లిలో కొబ్బరిచెట్లను పరిశీలిస్తున్న సోము

ఎమ్మెల్సీ సోము వీర్రాజు

మలికిపురం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌ పొంగి లక్షలాది కొబ్బరిచెట్లు చనిపోయి తీర ప్రాంత గ్రామాల్లోని రైతులు పడుతున్న బాధలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా ప్రయత్నిస్తానని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లిలోని తుఫాన్‌ సెంటర్‌ భవనంలో రైతులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉండే తీర ప్రాంతం లో కేశనపల్లి, తూర్పుపాలెం, శంకరగుప్తం తదితర గ్రామాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో శంకరగుప్తం డ్రెయిన్‌ పొంగి లక్షలాది కొబ్బరిచెట్లు చనిపోయి రైతులకు అపార నష్టం కలుగుజేస్తున్నాయని, శాశ్వత పరిష్కారాలు ప్రభుత్వాలు చూపకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు సోము దృష్టికి తీసుకువచ్చారు. సోము మాట్లాడుతూ ఈప్రాంత సమస్యను స్వయంగా చూశానని, కొబ్బరిచెట్లు చనిపోవడం తీవ్రంగా కలచివేస్తుందని, స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ అసెంబ్లీలో ప్రస్తావిస్తారని తెలిసిందని, తాను కూడా శాసనమండలిలో ప్రస్తావించి కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానన్నారు. కేశనపల్లిలో చనిపోయిన కొబ్బరిచెట్లను పరిశీలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, నియోజకవర్గ కన్వీనర్‌ అడబాల రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు మాలే శ్రీనివాసనగేష్‌,మండలాధ్యక్షుడు మేడిచర్లచాణుక్య ఉన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 12:29 AM