రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్లు
ABN , Publish Date - May 01 , 2025 | 12:43 AM
కార్పొరేషన్(కాకినాడ), ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.15 వేలు కోట్ల ఆర్థిక గ్రాంట్ కూడా మంజూరు చేసిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాకినాడలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు
కార్పొరేషన్(కాకినాడ), ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.15 వేలు కోట్ల ఆర్థిక గ్రాంట్ కూడా మంజూరు చేసిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాకినాడలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మా ట్లాడుతూ విడిపోయిన ఏపీకి అత్యాధునికమైన రాజధాని నిర్మాణం చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.18వేల కోట్ల నిధులు ఇచ్చిందని, ప్రస్తుతం రూ.15వేల కోట్ల ఆర్థిక గ్రాంట్ మం జూరు చేసిందన్నారు. ప్రధాని మోదీ మే 2న రాష్ట్రానికి వస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో ఏపీ ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్రంలో 11 నదుల ద్వారా రూ.50వేల కోట్లతో ఇంటింటికి మంచినీటి కుళాయి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.