వైసీపీ హయాంలో 16,260 మంది లివర్లు చెడిపోయాయి..
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:08 AM
గత ప్రభుత్వం జే బ్రాండ్ లిక్కర్ ఏరులైపారించి లివర్ వ్యాధిగ్రస్తులు పెరిగేలా చేసిందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు.
జే బ్రాండ్ మద్యమే కారణం
తూర్పు ప్రభుత్వాసుపత్రిలో ఇదీ ఐదేళ్ల పేషెంట్ల లెక్క
రాజమహేంద్రవరం సిటీ, జూలై 25( ఆం ధ్రజ్యోతి): గత ప్రభుత్వం జే బ్రాండ్ లిక్కర్ ఏరులైపారించి లివర్ వ్యాధిగ్రస్తులు పెరిగేలా చేసిందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. రాజమహేంద్రవరం టింబర్ మర్చంట్ అసోసియేషన్ హాలులో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం కారణంగా 16,260 మంది లివర్లు పాడై అనేక మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని చెప్పారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి లెక్కల ప్రకారం 2020లో లివర్ వ్యాధిగ్రస్తులు ఇన్ పేషెంట్లుగా 8 మం ది చేరగా 1303 మంది ఔట్ పెషేంట్లుగా చికి త్స చేయించుకున్నారని 2021లో 116 మంది ఇన్ పేషెంట్లు ఉంటే 3142 మంది చికిత్సచేయించుకున్నారన్నారు. 2022లో 167 మంది చేరితే 3961 మంది ఔట్ పెషేంట్లుగా చికిత్సచేయించుకున్నారని తెలిపారు. 2023లో 193 మంది చేరితే 2394 మంది చికిత్స చేయించుకున్నారన్నారు. 2024లో 345 మంది చేరితే 4631 మంది చికిత్సపొందారని చెప్పారు. ఇలా ప్రతి ఏటా లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య కేవలం కల్తీ మద్యం వల్లనే పెరిగిందన్నారు. జగన్ జమానలో ఫ్ లిక్కర్‌కు బానిసలై వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 2025లో 109 మంది ఆసుపత్రిలో చేరితే 1800 మంది కిత్స చేయించుకున్నారన్నారు. లిక్కర్ స్కాంలో జైలులో ఉన్న మిఽథున్‌రెడ్డికి సదుపాయాల కల్పన చూస్తే అతను పిక్నిక్ వచ్చి నట్టుగా ఉందన్నారు. సమావేశంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, నాయకులు మజ్జి రాంబాబు, కాశి నవీన్ కు మార్, వర్రే శ్రీనివాసరావు,బుడ్డిగ రాధా, ఉప్పు లూరి జానకిరామయ్య, రవి యాదవ్, చాపల చిన్నరాజు, దాస్యం ప్రసాద్,చిన్ని పాల్గొన్నారు.