అధ్యక్షా..విన్నారా!
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:47 AM
అధ్యక్షా..! మా సమస్యలివీ పరిష్క రించాలంటూ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యే లు గొంతెత్తారు.
గొంతెత్తిన ముగ్గురు ఎమ్మెల్యేలు
క్వశ్చన్ అవర్‌లో అవకాశం
టిడ్కో ఇళ్లు ఇవ్వాలి : గోరంట్ల
సొసైటీలపై నిఘా ఉండాలి : వాసు
సోలార్ స్కీమ్ ఉపయోగం : బత్తుల
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 18 (ఆం ధ్రజ్యోతి) : అధ్యక్షా..! మా సమస్యలివీ పరిష్క రించాలంటూ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యే లు గొంతెత్తారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభమైన గురువారం జిల్లా నుంచి ము గ్గురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మాట్లాడే అవ కాశం లభించింది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజమ హేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ క్వశ్చన్ అవర్‌లో పలు సమస్యలు లేవనెత్తారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే..
టిడ్కో ఇళ్లను కేటాయించండి
రాజమహేంద్రవరం రూరల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.రాష్ట్రంలో 5 లక్షల టిడ్కో ఇళ్లలో 2.5 లక్షల ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని.. గతంలో చంద్రబాబు ప్రతి ష్టాత్మకంగా నిర్మించిన మరో 2.5 లక్షల ఇళ్లలో ప్రస్తుతం 50 వేల మంది కూడా నివసించడం లేదన్నారు. నేను టిడ్కో ఇళ్ల పరిశీలనకు వెళ్లినప్పుడు రెండు పెద్దపెద్ద పాములు ఆ ఇళ్లలోకి వెళ్లాయి.మరో పక్క జగన్ హయాంలో ఆ ఇళ్లపై తీసుకున్న రుణాల వల్ల బ్యాంకర్లు ఇళ్లకు తాళాలు వేసుకుంటున్నారని.. కనీసం ఇంట్లోకి వెళ్లకుండానే లబ్ధిదారుల కు బ్యాంక్‌లు నోటీసులిచ్చి ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, బ్యాంకర్లతో మా ట్లాడి..ఇళ్లకు తాళాలు వేయ కుండా చూడాలని కోరారు.తక్షణమే సంబంధిత మం త్రిగారు స్పందించి వసతులు కల్పిం చాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యల వివరాలన్నీ రికార్డు చేయాలని,వాటికి పరిష్కారం చూపవలసిన అవసరం ఉం దన్నారు.స్పీకర్ అయ్యన్నప్రాత్రుడు ఇది మంచి సూచనగా చెప్పడం గమనార్హం. జీఎస్‌టీ తగ్గింపుపై కూడా మాట్లాడారు.
- గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్యే రాజమహేంద్రవరం రూరల్
సొసైటీలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండాలి
మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీల్లో డబ్బులు దాచుకుని చాలా మంది మోసపోతున్నా రని.. ఇటువంటి వాటిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండాలి.జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ వల్ల రాజమ హేంద్రవరం, కాకినాడలలో అనేక మంది అనేక మంది మోసపోయారు. సొసైటీలపై ప్రభుత్వం ఆడిట్‌గానీ, తనిఖీలు కానీ చేసే అధికారం లేనందువల్ల ఎవరికి వారు సొంతంగా ఆడిట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పేద , మధ్య తరగతి ప్రజలు ఎక్కువ వడ్డీ ఆశతో ఇటువంటి సొసైటీలు, బ్యాంకుల్లో పెడుతూ తీవ్రంగా నష్టపోతున్నారు.ఇటువంటి సొసైటీల లెక్కలను ఎప్పటి కప్పుడు అధికారులు తనిఖీ చేసేలా సంబంఽధిత మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పుల వల్ల స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కావాలని ఆస్ర్టేలియన్ హై కమిషన్ ఆయనను ఆహ్వానించి, అరుదైన గౌరవం ఇచ్చింది. 2001 లో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీకి మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది. - ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం సిటీ
సూర్యఘర్‌కు బ్యాంకర్లు సహకరించడంలేదు!
సోలార్ విద్యుత్ ప్రాజెక్టు చాలా మంచిది. దీని వల్ల కాలుష్యం కంట్రోల్ అవుతుంది. కానీ ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల సూర్యఘర్ పథకం ముందుకు వెళ్లడంలేదు. నా నియోజకవర్గంలో 98 వేల ఇళ్లు ఉండగా కేవలం 180 రిజిస్ర్టేషన్లే జరిగాయి. ప్రత్యేక టీమ్‌లతో ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ స్కీమ్ అమలుకు బ్యాంకర్లు సహకరించడం లేదు. లబ్ధిదా ర్లకు రుణాలివ్వడానికి ముందుకు రావడంలేదు. ప్రభుత్వం బ్యాంకర్లతో చర్చించాలి. ప్రభుత్వ కార్యాల యాలు, పాఠశాలలు, సచి వాలయాలకు ఉచిత స్కీమ్‌లో సోలార్ విద్యుత్ కల్పిస్తే,విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది.
- బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్యే రాజానగరం