Share News

చెత్త ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామంటే ఊరుకోం

ABN , Publish Date - Mar 10 , 2025 | 12:53 AM

తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్తను తెచ్చి బలభద్రపురం, కాపవరం గ్రామాల వద్ద విద్యుదుత్పత్తి ప్లాంట్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే ఊరు కునేది లేదని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

చెత్త ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామంటే ఊరుకోం
బలభద్రపురంలో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

ఎంత వరకైనా పోరాడతాం

అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

బిక్కవోలు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్తను తెచ్చి బలభద్రపురం, కాపవరం గ్రామాల వద్ద విద్యుదుత్పత్తి ప్లాంట్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే ఊరు కునేది లేదని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదివారం విలేకరులతో మా ట్లాడారు. మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ శనివారం విద్యుదుత్పత్తి ప్లాంట్‌ స్థల పరిశీలన చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మునిసిపాలిటీల చెత్తను ఇక్కడికి తీసుకువచ్చే ప్రతిపాదనలు ఎలా ఇచ్చారంటూ కలెక్టర్లను దుయ్యబట్టారు. ఈ ప్రతిపాదనను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.ఎట్టి పరిస్థితుల్లోను ఈ ప్రతిపాదన ఆమోదించేది లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో బలభద్రపురంలో ఏర్పాటు చేసిన గ్రాసిం పరిశ్రమ కారణంగా తీవ్ర కాలుష్యం వెదజల్లుతుందన్నారు. ప్రస్తు తం ఇక్కడ వందలాది ప్రజలు క్యాన్సర్‌ వ్యాధి బారిన పడుతుంటే ఇప్పుడు కూటమి ప్రభు త్వం చేస్తున్న నిర్వాకం ఇదా అంటూ ప్రశ్నిం చారు. కలెక్టర్లు ప్రతిపాదన పంపారా లేక పరిశీలన మాత్రమేనా అసలు ఈ ప్లాంట్‌ వ్యవహారం ఏ స్థాయిలో ఉందనేది స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏ స్థాయిలో ఉన్నా స్థానిక ప్రజల అభిప్రాయం మేరకు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ ప్రతిపాదనను ఆపాలని సీఎం చంద్రబాబు, మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణ, డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ తానని తెలిపారు. ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ఎక్కడో ఉన్న చెత్తను ఇక్కడకు తరలిస్తామంటే ఊరుకోమన్నారు.అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్లి పోరాడతామన్నారు.సమావేశంలో సర్పంచ్‌ బుంగా రామారావు, మాజీ ఎంపీటీసీ నల్లమిల్లి వెంకటసుబ్బారెడ్డి, ఎంపీ టీసీ చిన్నం రాఘవ పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2025 | 12:53 AM