Share News

కూటమిని విడదీయలేరు

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:09 AM

కూటమి ప్రభుత్వంలో వేగంగా అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలు కొన సాగుతున్నాయని.. పరిశ్రమలు నెలకొల్పడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

కూటమిని విడదీయలేరు
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఇతర నాయకులు

రాజమహేంద్రవరం రూరల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వంలో వేగంగా అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలు కొన సాగుతున్నాయని.. పరిశ్రమలు నెలకొల్పడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.రాజమహేంద్రవరంలోని గోరంట్ల నివాసంలో శనివారం విలేకరులతో మాట్లా డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు నెరవేర్చుతున్నామ న్నారు. విశాఖకు గూగుల్‌తో సహా మూడు డేటా సెంటర్లు వస్తున్నాయని..దీని వల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నార న్నారు.రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని గోరంట్ల అన్నారు. అందుకే ముందుగానే చెప్పినట్టు ప్రజా సమస్యలు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించి తామే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని స్ప ష్టం చేశారు.దీనిపై కొంతమంది అపోహలు సృష్టించేలా సోషల్‌ మీడియా వేదికగా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల తీరు ఇంకా మార లేదని మండిప డ్డారు. ఎన్ని దుష్ప్రచారాలు, కుతంత్రాలు చేసినా కూటమి ఐక్యతకు ఇబ్బంది లేదన్నారు. పీపీపీ విధానం తప్పని తాము అడ్డుకుంటా మని జగన్‌ అనడం తగదని విమర్శించారు. పీపీపీ ద్వారా చేయడం వల్ల వెయ్యి సీట్లు వస్తాయన్నారు.పీపీపీ విధానం వ్యతిరేకిస్తున్న జగన్‌ గతంలో కృష్ణపట్నం పోర్టు వంటివి ప్రైవేటుకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ నిర్యాకంతో ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోతే కూటమి ప్రభుత్వం వచ్చాకా బకాయిలు చెల్లిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మార్ని వాసుదేవరావు, వాసి రెడ్డి రాంబాబు, మత్స్యేటి ప్రసాద్‌, వెలు గుబంటి సత్య ప్రసాద్‌, పండూరి అప్పారావు, నున్న కృష్ణ, తలారి మూర్తి పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 01:09 AM