Share News

పేపరుమిల్లు కార్మికులకు న్యాయం చేశాం

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:11 AM

రాజమహేంద్రవరంలోని ఆంధ్ర ప్రదేశ్‌ పేపరుమిల్లు కార్మికులకు వేతన ఒప్పందం అమలు కూటమి ప్రభుత్వ విజయమేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు.

పేపరుమిల్లు కార్మికులకు న్యాయం చేశాం
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో టీడీపీ నాయకులు, పేపరుమిల్లు యూనియన్‌ కార్మికులు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 7( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలోని ఆంధ్ర ప్రదేశ్‌ పేపరుమిల్లు కార్మికులకు వేతన ఒప్పందం అమలు కూటమి ప్రభుత్వ విజయమేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. నూతన వేతన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో మిల్లు కార్మిక యూనియన్‌ నాయకులు మంగళవారం తిలక్‌ రోడ్డులో కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.గత వైసీపీ ప్రభుత్వంలో ప్యాకేజీపై ఉన్న శ్రద్ధ కార్మికుల వేతన ఒప్పందంపై చూపించలేదన్నారు. కార్మికుల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో న్యాయం జరిగేలా మంచి అగ్రిమెంట్‌ చేయించగలిగామన్నారు. అనంతరం పేపరుమిల్లు కార్మిక నాయకులు మాట్లాడుతూ గత ఐదేళ్ల కు పైబడి అగ్రిమెంట్‌ లేక చాలా బాధలు పడ్డామన్నారు. ఎమ్మెల్యే వాసు, ఎంపీ పురందేశ్వరి, మంత్రి దుర్గేష్‌లు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అగ్రిమెంట్‌ చేయించారన్నారు. విజయవాడలో జరిగిన అగ్రిమెంట్‌లో కార్మికులకు రూ.5,800 చొప్పున, కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.2,200 చొప్పున జీతం పెంచారని తెలిపారు. మంచి అగ్రిమెంట్‌ చేసి 4 వేల మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.ఏలూరులో అగ్రిమెంట్‌ కాపీ ఇచ్చారని దీనిపై 11 యూనియన్లు సంతకాలు పెట్టాయ ని తెలిపారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు,వర్రే శ్రీనివాసరావు, పేపరు మిల్లు కార్మిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 01:11 AM