Share News

అమలాపురంలో మిత్రమండలి సందడి

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:19 AM

అమలాపురం రూరల్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్‌ వైద్య కళాశాల ప్రాంగణంలో మిత్రమండలి చిత్ర బృందం సందడి చేసింది. టాలీవుడ్‌ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో దర్శకుడు ఎస్‌.విజయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన మిత్ర మండలి సినిమాలోని పాటలను కిమ్స్‌ ప్రాంగణంలో విడుదల చేశారు.

అమలాపురంలో మిత్రమండలి సందడి
అమలాపురం కిమ్స్‌ వైద్య కళాశాలలో సినిమా బృందంతో ఎంపీ హరీష్‌, చైతన్యరాజు

కత్తి అందుకో జానకీ పాట విడుదల

అమలాపురం రూరల్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్‌ వైద్య కళాశాల ప్రాంగణంలో మిత్రమండలి చిత్ర బృందం సందడి చేసింది. టాలీవుడ్‌ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో దర్శకుడు ఎస్‌.విజయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన మిత్ర మండలి సినిమాలోని పాటలను కిమ్స్‌ ప్రాంగణంలో విడుదల చేశారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌, కిమ్స్‌ చైర్మన్‌ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ గాత్రంతో ఆలపించిన పాటకు ఆర్‌ఆర్‌ ధ్రువన్‌పప్పీ సంగీతం అందించారు. ఇక సినిమాలో యువత పాత్రను వివరిస్తూ రూపొందించిన కత్తి అందుకో జానకి పాటను కాసర్ల శ్యామ్‌ రచించారు. విద్యార్థుల సమక్షంలో ఆ పాటను విడుదల చేసి వారితో కలిసి ప్రియదర్శి స్టెప్పులు వేశారు. చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న నిహారిక, డైరెక్టర్‌ ఎస్‌.విజయేందర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ధ్రువన్‌తో పాటు కిమ్స్‌ వైద్యుల బృందం నాయకులు బండారు రామ్మోహనరావు, కరాటం ప్రవీణ్‌ పాల్గొన్నారు. సినీ నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కించామని, వెన్నెల కిశోర్‌తో పాటు సత్య, గణేష్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారన్నారు. ఇప్పటికే టీజర్‌కు మంచి క్రేజ్‌ వచ్చిందన్నారు. ప్రియదర్శి తనదైన కామెడీ టైమింగ్‌, పంచ్‌లతో హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 12:19 AM