భారీ స్థాయిలో జనసేన సభ
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:00 AM
కలెక్టరేట్(కాకినాడ)/పిఠాపురం రూరల్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఈనెల 14వ తేదీన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ కవర్గం లోని చిత్రాడ గ్రామంలో నిర్వహి ంచనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సభకు లక్షలాది మంది జనసైనికులు హాజరవు తారని రాష్ట్ర పౌర

మంత్రులు నాదెండ్ల, దుర్గేష్
కలెక్టరేట్(కాకినాడ)/పిఠాపురం రూరల్, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఈనెల 14వ తేదీన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ కవర్గం లోని చిత్రాడ గ్రామంలో నిర్వహి ంచనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సభకు లక్షలాది మంది జనసైనికులు హాజరవు తారని రాష్ట్ర పౌరసరఫ రాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భావ సభ ఏర్పా ట్లను వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల, కందుల మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉండి ఈ సభను నిర్వహిస్తున్నామని, దీనికి అధిక సంఖ్యలో హాజరవ్వడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నా రు. సభ ప్రాంగణంతోపాటు పలుచోట్ల వైద్య శిబిరాలు, తాగునీరు, భోజన సదుపాయం, ఎల్‌ఈడీ స్ర్కీన్స్, మరుగు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జనసేన అధినేత పవన్ అభిమానులు, జనసైనికులు ఈ సభకు లక్షల్లో హాజరవుతారన్నారు. ఈనెల 12న వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టే యువత పోరుపై వారు స్పందించారు. యువతతోపాటు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్ ఇప్పుడు ఫీజుపోరు అంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. రాష్ట్రం నాశనం అవ్వడానికి జగన్ వైఖరి కారణ మన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పత్సమట్ల ధర్మరాజు, నాయకులు తలాటం సత్య, చోడిశెట్టి శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
సభా ఏర్పాట్ల పరిశీలన
పిఠాపురం మండలం చిత్రాడ శివారులోని ఎస్‌బీ వెంచర్స్‌లో జరిగే జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లును రాష్ట్ర పౌరసరఫరాలు, పర్యాటక శాఖామంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. సభావేదిక, ప్రాంగణంలో జరుగుతున్న పనులు, బారీకేడ్ల నిర్మాణం, గ్యాలరీల ఏర్పా ట్లను పరిశీలించి పనుల నిర్వహణపై సూచనలు ఇచ్చారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కల్యాణం శివశ్రీనివాసరావు, డీకే చైతన్య, పలువురు ఎమ్మెల్యేలు,జనసేన నాయకులు ఉన్నారు.