బాణసంచా పేలుడులో ఏడుగురు మరణించడం కలచివేసింది
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:58 AM
రాయవరం/మండపేట, అక్టోబరు 8 (ఆం ధ్రజ్యోతి): రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర కార్మికశాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశానికి హాజరైన మంత్రి సంఘటన విషయం తెలుసుకున్న మంత్రి హుటాహుటిన రాయవరం చేరుకుని సంఘటనపై తీ
మంత్రి వాసంశెట్టి సుభాష్
రాయవరం/మండపేట, అక్టోబరు 8 (ఆం ధ్రజ్యోతి): రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర కార్మికశాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశానికి హాజరైన మంత్రి సంఘటన విషయం తెలుసుకున్న మంత్రి హుటాహుటిన రాయవరం చేరుకుని సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. బాణసంచా తయారీ కర్మాగారాలు కనీస ప్రమాణాలు పాటించాలన్నారు. మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్నివిధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట రామచంద్రపురం ఆర్డీవో అఖిల, డీఎస్పీ రఘువీర్, అగ్నిమాపక సిబ్బంది, కూటమి నాయకులు ఉండవిల్లి శివ తదితరులు ఉన్నారు.