Share News

తల్లికి వందనంతో వెల్లివిరిసిన ఆనందం

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:14 AM

రామచంద్రపురం (ద్రాక్షారామ), జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం అమలుతో తల్లుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తుందని, ప్రభుత్వానికి తల్లులు వందనం చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

తల్లికి వందనంతో వెల్లివిరిసిన ఆనందం
సమావేశంతో మాట్లాడుతున్న మంత్రి సుభాష్‌

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

త్వరలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం

మంత్రి సుభాష్‌

రామచంద్రపురం (ద్రాక్షారామ), జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం అమలుతో తల్లుల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తుందని, ప్రభుత్వానికి తల్లులు వందనం చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం బులుసు కల్యాణమండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. చదువుకు మించి ఆయుధం లేదని, చదువుతో ప్రపంచాన్ని మార్చవచ్చన్నారు. పాఠశాలలు తెరచిన నాటికి సకాలంలో ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమ లు చేయడంతో విద్యార్థులకు ఉపయోగపడిందన్నారు. వైసీపీ పాలకులు రాష్ట్రంలో 67.27 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చామని చెప్పి కేవలం 42 లక్షల మందికి మాత్రమే ఇచ్చారని మంత్రి ఆరో పించారు. ఫీజు రీఎంబర్స్‌ మెంటు పథకం బకాయిలు పెట్టడంతో కూటమి ప్రభుత్వంపై భారం పడిందన్నారు. తల్లులు లేనివారికి తండ్రి లేదా సంరక్షకుని ఖాతాలో తల్లికి వందనం డబ్బులు జమచేశామన్నారు. పాఠశాలలు తెరచిన రోజే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యామిత్ర కిట్లు అందచే శామన్నారు. రాష్ట్రంలో 9600 ఆదర్శ పాఠశాలల్లో తరగతికో ఉపాధ్యాయుడిని నియమించి విద్యాప్రమాణాలు మెరుగుకు చర్యలు చేపట్టామన్నా రు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాని కి హాస్టళ్లకు సన్నబియ్యం ఇప్పటికే సరఫరా చేశామన్నారు. గత ప్రభుత్వం నాడు- నేడు పథకంతో నిధులు కాజేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకొచ్చి గాడిలో పెట్టామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలుచేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:14 AM