నకిలీ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:20 AM
రామచంద్రపురం(ద్రాక్షారామ), అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యాన్ని విక్రయిస్తే ఉపే క్షించబోమని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కు నాణ్యమైన మద్యం సరఫరా చేస్తుందని మ ంత్రి సుభాష్ తెలిపారు. శుక్రవారం రాత్రి డా క్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం బ
ఎక్సైజ్ సురక్ష యాప్‌తో నకిలీ మద్యానికి చెక్ : మంత్రి సుభాష్
రామచంద్రపురం(ద్రాక్షారామ), అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యాన్ని విక్రయిస్తే ఉపే క్షించబోమని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కు నాణ్యమైన మద్యం సరఫరా చేస్తుందని మ ంత్రి సుభాష్ తెలిపారు. శుక్రవారం రాత్రి డా క్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం బస్టాండు సమీపంలో ఆర్‌ఆర్ వైన్ షాపును ఆయన పరిశీలించారు. కూటమి అధి కారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక మద్యం విధానం తీసుకువచ్చి నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు.ముఖ్యంగా అక్రమ మద్యం అమ్మకాలు అరికట్టేందుకు, నాణ్యతను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సురక్షయాప్‌ను రూపొందించిందని తెలిపారు. మద్యాన్ని కొనుగోలు చేసిన వారు బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తాము కొనుగోలు చేసిన మద్యం నకిలీదా, నాణ్యమైనదా తెలుసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వం జేబ్రాండ్స్ మద్యం పాలసీతో ఇష్టానుసారంగా నాసిరకం మద్యం అమ్మ కాలు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడిం దన్నారు. సురక్షయాప్ వినియోగంపై ప్రతీ గ్రామంలోను అవగాహన కల్పించాలని కోరారు. యాప్‌తో మద్యం ఎక్కడ, ఎప్పుడు, ఏ కంపెనీ లో తయారయ్యిందో, రేటు కూడా తెలుసుకోవచ్చన్నారు. నకిలీ మద్యం తయారీ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి తెలిపా రు. ఎక్సైజ్ సీఐ పి.శ్రీనివాస్, ఎస్‌ఐలు ఉన్నారు.