Share News

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు మంత్రి సాయం

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:26 AM

ఆలమూరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు సాయం చేసి రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుబాష్‌ మానవత్వాన్ని చాటుకున్నారు. రాయవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన సూరిశెట్టి రేవతి, రామకృష్ట

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు మంత్రి సాయం
మహిళను మంత్రి వాహనం వద్దకు తీసుకెళ్తున్న దృశ్యం

ఆలమూరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు సాయం చేసి రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుబాష్‌ మానవత్వాన్ని చాటుకున్నారు. రాయవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన సూరిశెట్టి రేవతి, రామకృష్ట దంపతులు బైక్‌పై వెళ్తుండగా ఆలమూరు మండలం గుమ్మిలేరు వద్ద ప్రమాదం జరిగి రేవతి తీవ్రంగా గాయపడింది. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలకు రామచంద్రపురం నుంచి అమరావతి వెళ్తున్న మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆగారు. మహిళను తక్షణం తన వాహనంలో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యసాయం అందించారు. అక్కడ ఉన్న వైద్యులతో సంప్రదించి మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయన అమరావతికి తరలివెళ్లారు.

Updated Date - Mar 11 , 2025 | 01:26 AM