34 శాతానికి బీసీ రిజర్వేషన్లు
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:59 AM
భవిష్యత్తులో పావలా వడ్డీకే విద్యారుణాలు ఇచ్చే యోచన కూట మి ప్రభుత్వం చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు.
226 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో పావలా వడ్డీకే విద్యారుణాలు ఇచ్చే యోచన కూట మి ప్రభుత్వం చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. రాజమహేంద్రవరం త్యాగరాజ భవన్‌లో ఆదివారం రాత్రి 226 మంది శెట్టిబలిజ పదో తరగతి మెరిట్ విద్యార్థులకు గోద్రేజ్ సంస్థ ఎస్‌ఆర్ ఫండ్స్ నుంచి స్కాలర్‌షిప్స్ పంపిణీ చేసి మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు 34 శాతానికి పెంచబోతున్నారని, బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నారని చెప్పా రు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అన్న ఎన్‌టీఆర్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే అటుపై ఏ ముఖ్యమంత్రి దానిని మార్చలేదన్నారు. కానీ జగన్ వచ్చి 24 శాతానికి తగ్గించడం వల్ల ఆ ఐదేళ్లు 16 వేల మంది బీసీలు అవకాశాలు కోల్పోయారన్నారు. కొంతమంది కండువాలు మార్చిన వారు మా పార్టీలోకి వచ్చారని తులసివనంలో గంజాయి మొక్కలైన వారిని ఎట్టిపరిస్థితుల్లో సీఎం చంద్రబాబు ఉపేక్షించరని చెప్పారు.కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ గతంలో జగన్ కార్పొరేషన్లు పెట్టి వారి నాయకులకు జీతాలు ఇచ్చుకున్నారు తప్పితే వాటికి నిఽధులు కేటాయించడం గీత కులాలకు న్యాయం చేయడం వంటివి చేయలేదన్నారు. మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందన్నారు. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడు పూడి సత్తిబాబు మాట్లాడుతూ శెట్టిబలిజ విద్యార్థుల మెరిట్ స్కాలర్‌షిప్స్ గోద్రేజ్ సీఎస్‌ఆర్ ఫండ్స్‌ను ఇప్పించిన మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రులు,వివిధ కమిటీల చైర్మన్లను శెట్టిబలిజ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. తొలుత వేదికపై జ్యోతిరావు పూలే, దొమ్మేటి వెంకట రెడ్డి తదితర మహనీయులు చిత్రపటాలకు పూలమాలతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతలక్ష్మి, వడ్డె కార్పొరేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జనసేన నగర అధ్యక్షుడు వై.శ్రీనివాస్, కడియాల వీరభద్రరావు, బుడ్డిగ రాధా, కడలి రామకృష్ణ పాల్గొన్నారు.