పేదల ఆరోగ్య సంరక్షణ మా బాధ్యత
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:59 AM
ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రాథమిక బాధ్యతగా కూటమి ప్రభుత్వం భావిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్/కొవ్వూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రాథమిక బాధ్యతగా కూటమి ప్రభుత్వం భావిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి (జీజీహెచ్) ఎంసీహెచ్ బ్లాకులో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్‌ఎన్‌సీయూ, పీఎన్‌సీయూ తదితర విభాగాలను మంగళవారం ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర నివాసంలో కొవ్వూరు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబు పదిహేను రోజులకోసారి స్వయంగా ఆరోగ్య రంగంపై సమీక్ష చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్లు, వైద్యసిబ్బందిలో అంకితభావం పెరిగిందని, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తాము ఆర్భాటంగా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్నారని, కానీ ఐదేళ్లలో రూ.475 కోట్లు అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇచ్చి కేవలం రూ.75 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. తాము ఇప్పటికి రూ.144 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. పీపీపీ విధానంలో 100 నుంచి 350 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నా మని తెలిపారు. 50 పడకల ఆసుపత్రుల్లేని 105 నియోజకవర్గాలను గుర్తించామన్నారు. అక్కడ ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో మల్టీ స్పెషాలీటీ ఆసుపత్రులు నిర్మాణం చేపడతామన్నారు.100 పీహెచ్‌సీలకు టెండర్లు పిలుస్తున్నాం. అవసరమైన చోట సీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రా ష్ట్రంలో 5 చోట్ల రంపచోడవరం, పార్వతీపురం, బుట్టాయిగూడెం మరో 2 చోట్ల 100 పడకల మల్టీ స్పెషాలీటీ ఆసుపత్రులు నిర్మించడానికి ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలపై రూ. 800 కోట్లు, మందుల సరఫరా రూ. 1000 కోట్లు, ఆరోగ్యశ్రీ కింద రూ. 2500 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని చె ప్పారు. సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన చేపడుతున్నా మన్నారు. అర్హులందరికి సదరం సర్టిఫికెట్లు అంది స్తామని తెలిపారు. రాజమహేంద్రవరంలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు 75 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. కొవ్వూరులో గతంలో మంజూరైన ట్రామా కేర్ సెంటర్‌ను పునః పరిశీలన చేస్తామన్నారు. ఆయన వెంట కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ,నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ కెన్నడీ, ఆర్‌ఎంఓ సుబ్బారావు, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బోడపాటి ముత్యాలరావు, పిల్లలమర్రి మురళీకృష్ణ,కంటమణి రామకృష్ణారావు తదితరులు ఉన్నారు.
అవయవ దానంపై అవగాహన పెంచండి : మంత్రి
రాజానగరం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : అవయవ దానంపై ఉన్న అపోహలు విడనాడేలా వైద్యులు ప్రజ లకు అవగాహన కల్పించాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డేను పుర స్కరించుకుని రాజానగరం జీఎస్‌ఎల్‌లో మంగళవారం జీవన్ దాన్ ఏపీ నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి 8 అవ యవాలు ఇతరులకు దానం చేయవచ్చన్నారు. అవయ వాల మార్పిడిలో మూడో స్థానంలో ఉన్న భారత్.. అవయవాల దానంలో మాత్రం 68వ స్థానంలో ఉంద న్నారు.మన రాష్ట్రంలో 2023లో 41 మంది అవయవాలు దానం చేయగా 126 మందికి అమర్చారన్నారు. 2024 ఈ సంఖ్యలు 66,210 మందికి పెరిగాయన్నారు. జీవన్ దాన్ ఏపీ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు ఆర్గాన్ డొనేషన్, ట్రాన్స్ ప్లాంటేషన్లపై వివరించారు.అనంతరం జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాలలో రూ. 35 కోట్లతో నెలకొల్పిన ఏడు అడ్వాన్స్ ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఆఫరేషన్ థియే టర్లను ప్రారంభించారు. జీఎస్‌ఎల్ వైద్య విద్యా సం స్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, రాజమ హేంద్రవరం ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విజయభాస్కర్, అడిషనల్ సూపరింటెండెంట్ సుబ్బారాయుడు, వీరన్న చౌదరి,జీఎస్‌ఎల్ డైరెక్టర్ డాక్టర్ గన్ని సందీప్ ఉన్నారు.
సమస్యలు విన్నవించిన ఎమ్మెల్యే ముప్పిడి
కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు.మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని నియోజకవర్గ సమస్యలు విన్నవించారు. కొవ్వూరు ఆసుపత్రిలో 8 మంది వైద్యుల కొరత ఉందని, భర్తీ చేయాలని, పీహెచ్‌సీలలో మౌలిక సదుపాయాల కల్పన కొరవడిందని..దశాబ్దాల కిందట నిర్మించిన భవ నం లీక్ అవుతుందని తెలిపారు.దీనిపై స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ త్వరలోనే కొవ్వూరు ఆసుపత్రిలో వైద్యుల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. 100 పడకల ఆసుపత్రి అప్‌గ్రేడేషన్‌పై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.