Share News

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:59 AM

రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతని స్తోం దని రాష్ట్ర విద్యుత్‌ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
చాగల్నాడు ఎత్తిపోతల పథకం నీటిని విడుదల చేసి పరిశీలిస్తున్న మంత్రి రవికుమార్‌, ఎమ్మెల్యేలు గోరంట్ల, నల్లమిల్లి, బత్తుల, రుడా చైర్మన్‌ బీవీఆర్‌

రాజమహేంద్రవరం రూరల్‌/రాజానగరం, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతని స్తోం దని రాష్ట్ర విద్యుత్‌ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. రాజమహేంద్రవరం రూ రల్‌ కాతేరు సమీపంలోని చాగల్నాడు ఎత్తి పోతల పఽథకం నుంచి మంత్రి రవికు మార్‌తో కలిసి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి బుధవారం సాగునీటిని విడు దల చేశా రు. తొలుత గోదావరి నదీమ తల్లికి పసుపు, కుంకుమ, పూలు సమర్పించి హారతులిచ్చారు. అనంతరం స్విచ్చాన్‌ చేసి నీటిని విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా రాజానగరం, అన పర్తి నియోజకవర్గాల్లోని రంగంపేట, కోరు కొండ, రాజానగరం మండలాల పరిధిలో 6,250 ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. చాగల్నాడు మొదటి దశ నుంచి లీడింగ్‌ ఛానల్‌ ద్వారా కోలమూరులోని రెండో దశకు అక్కడి నుంచి మరో లీడింగ్‌ చానల్‌ ద్వారా పాలచర్లలోని మూడో దశకు చేరుకుని అక్కడి నుంచి కాలువ ద్వారా పంట పొలాలకు చేరు కుంటుందన్నారు. చాగల్నాడు ఎత్తిపోతల పఽథ కం మొదటి దశలో ప్రస్తుతానికి ఒక పంపు మాత్రమే పనిచేస్తోందని, మిగిలిన వాటికి మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసి అందు బాటులోకి తెచ్చే దిశగా చర్యలు చేపడ తామ న్నారు.రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరా మకృష్ణ మాట్లాడుతూ చాగల్నాడు ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరాకు సాగునీరందించాల న్నదే తమ లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్‌ బీవీఆర్‌.చౌదరి, జలవనరులశాఖ ఈఈ కె.వెంకటేశ్వరరావు, డీఈ పి.పురుషోత్తం దొర, ఏఈ పి.సత్యనారాయణ, కాలువ చైర్మన్‌ అబ్బిరెడ్డి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:59 AM