Share News

ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం

ABN , Publish Date - May 05 , 2025 | 11:30 PM

జగ్గంపేట రూరల్‌/కాకినాడ రూరల్‌/ పెద్దా పురం, మే 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సుడిగాలి పర్యటన చేశారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి పర్యటించి అకాల వ ర్షాలతో తడిచిపోయిన ధాన్యం రాశులను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలతో తడిచిపోయిందని

ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం
కాట్రావులపల్లిలో తడిచిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రి మనోహర్‌, ఎమ్మెల్యే నెహ్రూ

రైతులకు అన్యాయం జరగదు

మంత్రి నాదెండ్ల మనోహర్‌

కాకినాడ జిల్లాలో తడిచిన ధాన్యం రాశుల పరిశీలన

జగ్గంపేట రూరల్‌/కాకినాడ రూరల్‌/ పెద్దా పురం, మే 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సుడిగాలి పర్యటన చేశారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి పర్యటించి అకాల వ ర్షాలతో తడిచిపోయిన ధాన్యం రాశులను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలతో తడిచిపోయిందని, తమను ప్ర భుత్వమే ఆదుకోవాలని రైతులు మంత్రికి విన్నవించుకున్నారు. నాదెండ్ల మాట్లాడుతూ కూట మి ప్రభుత్వంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జ రగదని హామీఇచ్చారు. తడిచిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని రైతులు అధైర్య పడవద్దన్నారు. ఇక్కడి సమస్యను ఎమ్మెల్యే జ్యో తుల నెహ్రూ తమ దృష్టికి తీసుకువచ్చిన వెం టనే పర్యటనకు వచ్చానన్నారు. జిల్లాలో 95వేల మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేసే విధంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. అవసరమైతే మరో 50వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసేందుకు కూడా ఆలోచిస్తున్నామన్నారు. జగ్గంపేట మండలంలో 250 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి దృష్టికి నెహ్రూ తీసుకెళ్లగా అవసరమైతే 350 మెట్రిక్‌ టన్నులు అవసరమైన కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద న్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయం చేసేందుకు ప్రయతిస్తున్నాయని, నమ్మవద్దని వారి కుట్రలను తి ప్పి కొట్టాలని రైతులను కోరారు. ఆయన వెంట జేసీ రాహుల్‌మీనా, సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ చైర్మన్‌ తోట సుధీర్‌, సివిల్‌ సప్లై డీఎం దేవ లనాయక్‌, జగ్గంపేట జనసేన ఇన్‌చార్జ్‌ తుమ్మలపల్లి రమేష్‌, కుడా చైర్మన్‌ తుమ్మలబాబు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.విజయకుమార్‌ ఉన్నారు.

కాకినాడ రూరల్‌ మండలం చీడిగ హైవే రోడ్డుపై తడిసిపోయిన ధాన్యాన్ని మంత్రి మనో హర్‌ ఎమ్మెల్యే పంతం నానాజీతో కలిసి పరిశీలించారు. రైతులు, వ్యవసాయ కూలీలతో మా ట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నిబంధనలు పాటించని రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆర్డీవో మల్లిబాబును ఆ దేశించారు. పెద్దాపురం మండలం జె.తిమ్మాపు రంలో తడిసిన ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖను సమాయత్తంచేసినట్టు చెప్పారు.

Updated Date - May 05 , 2025 | 11:30 PM