Share News

జనసేన ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:25 AM

కలెక్టరేట్‌(కాకినాడ), మార్చి 10(ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో మార్చి 14న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏ

జనసేన ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు
కాకినాడలో మాట్లాడుతున్న మంత్రి నాదెండ్ల

వేదికపై యువత, రైతు, మహిళ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం

మంత్రి నాదెండ్ల మనోహర్‌

కలెక్టరేట్‌(కాకినాడ), మార్చి 10(ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో మార్చి 14న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సభ దాదాపు 5గంటలపాటు సాగుతుందన్నారు. మన భాష, యాస, సం స్కృతిని ప్రతిబింబించేలా కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. సభకు పెద్దఎత్తున కా ర్యకర్తలు, అభిమానులు తరలిరానున్నా దృష్ట్యా వారికి ఎలాంటి ఇక్కట్లు ఎదురుకాకుండా జాగ్ర త్తలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా తిరు గు ప్రయాణంలో భోజనానికి ఇబ్బంది కలగ కుండా ముఖ్యమైన 4 రహదారుల్లో భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభలో యువతకు మాట్లాడే అవకాశం కల్పించాలని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారన్నా రు. రైతు, మహిళ ప్రతినిధులు మాట్లాడతార న్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టేబోయే కార్య క్రమాలపై పవన్‌ మాట్లాడతారని పేర్కొన్నారు.

పారిశుధ్యం కోసం ప్రత్యేక కమిటీ

సభ పూర్తయిన అనంతరం పరిసరాలను శుభ్రం చేయడానికి ప్రత్యేక కమిటీ నియమిం చాలని పవన్‌ సృష్టం చేశారన్నారు. ఈ మేరకు కాకినాడ ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 25 మంది స్థానిక నాయకులతో కమిటీని నియమిం చామని, ఈ కమిటీ సభ ముగిసిన అనంతరం సభా ప్రాంగణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతా ల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జెండా లు, ఫ్లెక్సీలు, ఇతర పార్టీల జెండాలు కిందప డినా వాటిని జాగ్రత్తగా తొలగిస్తారని తెలిపారు. సభకు తరలివచ్చే కార్యకర్తల కోసం మజ్జిగ, మంచినీరు, ఓఆర్‌ఎస్‌ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నా మన్నారు. వీటితోపాటు పుచ్చకాయ ముక్కలు ఉచితంగా అందించేలా ప్రణాళిక చేస్తున్నామ న్నారు. ఇందుకు కాకినాడ, చుట్టుపక్కల ప్రాం తాల తోపుడు బండ్లవారితో మాట్లాడుతున్నాం.

75 సీసీ కెమెరాలతో నిఘా

ఉపముఖ్యమంత్రి పవన్‌ సభకు హాజరవు తున్నందున ఆయన భద్రతాపరంగా తీసుకో వాల్సిన జాగ్రత్తలు పోలీస్‌ డిపార్టుమెంట్‌ తీసు కుంటుందన్నారు. ఇందుకోసం 75 సీసీ కెమెరాల తో నిఘా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ పిడుగు హరిప్రసాద్‌, కాకినాడ ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్‌, పత్సమట్ల ధర్మ రాజు, రాష్ట్ర సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోట సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

సభ ఏర్పాట్ల పరిశీలన

పిఠాపురం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): జనసేన ఆవిర్భావ సభకు తరలివచ్చే లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ సూచించారు. పిఠాపురం మండలం చిత్రాడ శివారులో ఎస్‌బీ వెంచర్స్‌ ఆవరణలో ఈనెల14న జరగనున్న 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సభ ఏర్పా ట్లును ఆయన జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌తో కలిసి సోమవారం సాయంత్రం పరిశీలించారు.

Updated Date - Mar 11 , 2025 | 01:25 AM