Share News

24 గంటలూ వైద్యం అందాలి

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:10 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కం దుల దుర్గేష్‌ అన్నారు.

24 గంటలూ వైద్యం అందాలి
సమిశ్రగూడెం ఆసుపత్రిని పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న మంత్రి దుర్గేష్‌

సమిశ్రగూడెంలో మంత్రి తనిఖీ

నిడదవోలు, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కం దుల దుర్గేష్‌ అన్నారు. ఆంధ్రజ్యోతి దినప త్రికలో బుధవారం ‘‘పగలు వైద్యం.. రాత్రికి తాళం’’ శీర్షికన నిడదవోలు మండలం సమిశ్ర గూడెం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంపై ప్రచురితమైన కథనంపై ఆయన స్పం దించారు. ఆసుపత్రిని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అత్యవసర వైద్య సేవలు ఏ మేరకు అందుతున్నాయన్న అం శంపై ఆరా తీశారు.రాత్రి వేళలో ఆసుపత్రి తలుపులు ఎందుకు మూసివేస్తున్నారని ప్ర శ్నించారు. రాత్రి వేళల్లో కూడా అత్యవసర సేవలందించాలని ఆదేశించారు. విధుల్లో నిర్ల క్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరిం చా రు.ఇక నుంచి ఈ తరహా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.అనంతరం సమిశ్రగూ డెంలోని మండల పరిషత్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో 192 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చా రని.. ఒక్క నిడదవోలు మండలంలోనే 2,137 బంగారు కుటుంబాలను గుర్తించామని తెలి పారు. త్వరలోనే మరింత మంది మార్గద ర్శకులు, బంగారు కుటుంబాలను గుర్తించి ఆగస్టు 8వ తేదిన పూర్తి వివరాలు వెల్లడి స్తామన్నారు. పేదరిక నిర్మూలనకు ఎవరైనా ముందుకు వచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చన్నారు. ఆయన వెంట డి ప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సంధ్య, వైద్యా ధికారులు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 01:10 AM