Share News

నంది అవార్డులు ఇస్తాం

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:09 AM

మలికిపురం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉత్తమ తెలుగు సినిమాలకు నంది అవార్డులను ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ తెలి పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జి ల్లా మలికిపురంలోని చంటిరాజు విల్లాస్‌లో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రాజీ.. నో కాంప్రమైజ్‌ సినిమా షూటింగ్‌కు మంత్రి కందుల దుర్గేష్‌ క్లాప్‌ నివ్వగా కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సు

నంది అవార్డులు ఇస్తాం
సినిమా చిత్రీకరణకు క్లాప్‌ కొడుతున్న మంత్రి కందుల దుర్గేష్‌

సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌

మలికిపురంలో రాజీ... నో కాంప్రమైజ్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం

మలికిపురం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉత్తమ తెలుగు సినిమాలకు నంది అవార్డులను ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ తెలి పారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జి ల్లా మలికిపురంలోని చంటిరాజు విల్లాస్‌లో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రాజీ.. నో కాంప్రమైజ్‌ సినిమా షూటింగ్‌కు మంత్రి కందుల దుర్గేష్‌ క్లాప్‌ నివ్వగా కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేసి ప్రారంభించారు. దుర్గేష్‌ మాట్లాడుతూ నంది అవార్డుల ప్రదానం కోసం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లతో ఇప్పటికే చర్చలు జరిపారన్నారు. నంది నాటకోత్సవాల నిర్వహణ కూడా చేపడతామన్నారు. ప్రధానంగా కోనసీమలో కేరళకు మించి అద్భుతమైన లోకేషన్లు ఉన్నాయన్నారు. చిత్ర నిర్మాణాలకు అనుకూలమైన ప్రాంతమని ప్రభుత్వం కూడా ప్రోత్సాహాలు ఇచ్చేందుకు అనుమతులు సులభతరం చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి సుభాష్‌ మాట్లాడుతూ సినిమాలతో పాటు కార్మికులకు అన్ని ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రాంకీ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌ పతాకంపై గెద్దాడ వెంకటసత్యప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాంకీ నిర్మిస్తూ హీరోగా కూడా నటిస్తున్నారు. మరో హీరోగా సందీప్‌, హీరోయిన్‌గా జయశ్రీ బర్మన్‌, సహనటులుగా రాజీవ్‌ కనకాల, పృథ్వీరాజ్‌, మాధురి, జబర్దస్త్‌ అశోక్‌, రాము నటిస్తున్నారు. కేఎం రాధాకృష్ణ సంగీతం సమకూరుస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ గ్రామీణప్రాంతాల్లో భార్యాభర్తల అన్యోన్యతతో పాటు బంధువుల ప్రేమానురాగాలను ఈ చిత్రంలో చూపిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌, ఏపీ మార్కెట్‌ఫెడ్‌ డైరెక్టర్‌ గుండుబోగుల పెదకాపు, కేవీ చంటిరాజు, గెద్దాడ నాగేశ్వరరావు, దిరిశాల బాలాజీ, కేవీ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 12:09 AM