ఇక తవ్వేయ్!
ABN , Publish Date - Jun 16 , 2025 | 01:07 AM
జిల్లాలో చాలా కాలం తర్వాత మైనింగ్ సందడి మొదలు కాబోతుంది. రేపో మాపో మైనింగ్ పాలసీ మీద జీవో రాబోతుంది.

ఏడాదిగా కొత్త లీజుల్లేవ్
కుంటుపడిన మైనింగ్
గత వైసీపీలో పూర్తిగా ధ్వంసం
మార్పులతో ప్రభుత్వం శ్రీకారం
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో చాలా కాలం తర్వాత మైనింగ్ సందడి మొదలు కాబోతుంది. రేపో మాపో మైనింగ్ పాలసీ మీద జీవో రాబోతుంది. గత వైసీపీ పాలనలో మైనింగ్ విధానం ధ్వంస మైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పెద్దలే నేరుగా రంగంలోకి దిగి.. లీజుదార్లను తరిమి కొట్టేసి మైనింగ్ చేయించిన సంఘటనలు ఉ న్నాయి.గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎట్ట కేలకు కొత్త పాలసీ తెచ్చింది.కానీ ఏడాదిగా మైనింగ్ లీజులు లేవు.ఈ ఏడాది ఏప్రిల్ 29న కొత్తపాలసీపై ప్రభుత్వం ఓ సర్క్యులర్ జారీ చేసింది. దానిని జీవో రూపంలో ఒకటి రెండు రోజుల్లో జారీ చేయనుంది. ఉమ్మడి తూర్పుగో దావరి జిల్లాలో బిల్డింగ్ మెటల్, రోడ్ మెటల్, గ్రానైట్, గ్రావెల్, లేటరైట్ గనులు ఉన్న సం గతి తెలిసిందే. వీటిలో ఇప్పటి వరకూ స్వంత స్థలాలు లీజుకు తీసుకున్నవారు తప్ప.. ప్రభు త్వ స్థలాలు లీజుకు ఇవ్వలేదు.
ఉమ్మడి జిల్లాలో 250 దరఖాస్తులు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమా రు 250 లీజు దరఖాస్తులు పెండింగ్‌లో ఉ న్నాయి.ఒకట్రెండు రోజుల్లో రాబోతున్న కొత్త మైనింగ్ పాలసీ వల్ల మళ్లీ లీజులు మొద లు కానున్నాయి.ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్( ఎస్‌వోపీ) ప్రకారం 2023 మార్చి 13వ తేదీ నాటికి ఫైలైన పెండింగ్ మినరల్ కన్సెషన్ దరఖాస్తులు పరిశీలించి పరిష్కారానికి ఒక విధానం రూపొందించారు.సింగిల్ డెస్క్ పోర్టల్, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు గుర్తించి జిల్లా మైనింగ్ అధికారి లాగిన్‌లో ఉంచుతున్నారు. అర్హత ఉన్న దరఖాస్తులకు ఆమోదం తెలిపి అర్హత లేనివాటిని తొలగి స్తారు. అర్హత ఉన్న దరఖాస్తుదారుల నుంచి భద్రత డిపాజిట్ కట్టించుకుంటారు. మూడు నెలల్లోపు ఈ చెల్లింపులు చేయాలి. తర్వాత ఎన్‌వోసీ, డీజీపీఎస్ సర్వేలు చేస్తా రు. భద్రత డిపాజిట్ చెల్లించకపోతే అర్హత కోల్పోతారు. గ్రానైట్ల మార్బుల్,బిల్డింగ్ మెటీ రియల్‌కు తాజాగా దరఖాస్తు చేయాలి. ఇం డస్ర్టియల్ మినరల్‌కు వేలం పద్దతి ఉం టుంది.ఇవన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతాయి.
గత ప్రభుత్వంలో దోపిడీ
గత ప్రభుత్వంలో మైనింగ్ అంతా ఎమ్మె ల్యేలు, ఇతర పార్టీ పెద్దల చేతుల్లోకి పోయిం ది. అంతకుముందు ఎవరైనా వ్యక్తికి సొంత కొండ ఉంటే దానిని పంట సాగుకు సరిచే సుకోవడానికి తహశీల్దార్, ఇతర అధికారులకు దరఖాస్తు చేస్తే సరిపోయేది. ప్రస్తుతం సొంత భూమిలో మినరల్ ఉన్నా, కొండలు ఉన్నా, ఆయా ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఇటీవల అక్కడక్కడా తవ్వుతున్న గ్రావెల్, మట్టి వంటి వాటిలో కూడా లారీకి రూ.3 వేల వరకూ ఆయా ప్రాంత ప్రతిని ధులు లాగేస్తుండడం గమనార్హం. గత ప్రభు త్వం సీనరేజి ప్రైవేట్ పరం చేసి కూడా బాగా దోచుకుంది. రేపో మాపో ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న కొత్త మైనింగ్ పాలసీలో ఏ మినరల్‌ను ఏ విభాగంలో పెడతారో, ఏ ధరలు నిర్ణయిస్తారో, సీనరేజి పరిస్థితి ఏంటో అనే చర్చ ఆయా వర్గాల్లో మొదలైంది.