స్కెచ్‌కు బ్రేక్!
ABN , Publish Date - Jul 06 , 2025 | 01:06 AM
పక్కా ’స్కెచ్’కు బ్రేక్ పడింది. ‘ఆంధ్రజ్యోతి’లో శని వారం పక్కాగా ’స్కెచ్’ అంటూ వచ్చిన కథనం గనుల శాఖలో తీవ్ర కలకలం రేపింది.

లీజు దరఖాస్తుల పరిశీలనకు బ్రేక్
వారం రోజులపాటు నిలిపివేత
సర్వేయర్ పన్నాగానికి చెక్
డీడీతో నేడు కాకినాడ కలెక్టర్ సమీక్ష
కలెక్టర్‌ను కలిసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే
దరఖాస్తుల రద్దుకు డిమాండ్
సర్వేయర్ వెనకేసింది రూ.కోటి పైనే
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
పక్కా ’స్కెచ్’కు బ్రేక్ పడింది. ‘ఆంధ్రజ్యోతి’లో శని వారం పక్కాగా ’స్కెచ్’ అంటూ వచ్చిన కథనం గనుల శాఖలో తీవ్ర కలకలం రేపింది. దీంతో ఉమ్మడి జిల్లాలో మైనింగ్ లీజుల కోసం దాఖలైన దరఖాస్తులన్నింటిని ఓ వారం పాటు పరిశీలించకుండా పక్కన పెట్టాలని అధి కారులు నిర్ణయం తీసుకున్నారు. రాజమహేంద్రవరం లోని గనుల శాఖ సర్వేయర్ ముందస్తు పథకంతో మైనింగ్ స్కెచ్‌లన్నీ అడ్డగోలుగా విక్రయించి అరకోటికి పైగా సంపాదించడంతో పాటు అనేక మంది దరఖాస్తు దారులకు స్కెచ్‌లే లేకుండా చేసి వారిని దెబ్బతీశాడు. అటు ఒకే స్కెచ్‌ను ఒకరికి తెలియకుండా మరొకరికి విక్రయించి అడ్డంగా బరితెగించేశాడు. రాజమహేంద్ర వరం గనులశాఖ ఏడీ కార్యాలయ సర్వేయర్ మైనింగ్ స్కెచ్‌లన్నీ ముందే తన వద్దకు రప్పించి దరఖాస్తు దారులకు హెక్టారుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల కు విక్రయించేసిన విషయం వెలుగులోకి తేవడం తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రజ్యోతి కథనం నేపథ్యంలో అనేక మంది దరఖాస్తుదారులు తమకు సైతం స్కెచ్‌లు ఇవ్వకుండా చేసి లీజు రాకుండా కుట్రపన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరైతే తాము సదరు సర్వే యర్‌కు రూ.5 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసిన స్కెచ్‌ను మరొకరికి విక్రయించడంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అనేకమంది సర్వేయర్ బాధితులు బయటకు వచ్చారు. అటు సర్వేయర్ ముందస్తు పథ కంతో స్కెచ్‌ల పేరుతో దందాలు నడిపిన నేపథ్యంలో సోమవారం నుంచి పరిశీలన ప్రక్రియ ప్రారంభించా ల్సిన దరఖాస్తులన్నింటిని నిలిపి వేయాలని గనులశాఖ నిర్ణయించింది. ఈలోపు జరిగిన తంతంగంపై పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టాలని కాకినాడ కలెక్టర్ మైనింగ్ డీడీని ఆదేశించారు. అందులోభాగంగా స్కెచ్‌ల పేరుతో అసలు జరిగిన కథేంటనేది తేల్చాలని కలెక్టర్ నిర్ణయించారు.ఈ మేరకు ఆదివారం మైనింగ్ అధికా రులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ఎన్ని స్కెచ్‌లు ఉన్నాయి? ఎంత మందికి విక్రయించారు? వసూలు చేసిందెంత? దీని వల్ల స్కెచ్‌లు దకక్క నష్టపోయిన వారెందరు? అనేది ఈ సమావేశంలో నిగ్గు తేల్చనున్నారు. తద్వారా వచ్చిన దరఖాస్తులను పూర్తిగా పక్కనపెట్టి కొత్తగా దాఖలు చేయించాలా? లేదంటే తదుపరి వ్యుహం ఏంటనేది అమరావతిలో గనులశాఖ ఉన్నతాధికారులను సంప్ర దించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాఖలైన 53 మైనింగ్ లీజు దరఖాస్తుల్లో 45 ఒక్క రౌతులపూడిలోని క్వారీలకే వచ్చాయి. స్కెచ్‌లు కొందరికే దక్కేలా మాయ చేసిన నేపథ్యంలో దరఖాస్తులను రద్దు చేయాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధికారులను కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం కాకినాడ జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. అవకతవకలు లేకుండా పారదర్శకంగా దరఖాస్తుల ప్రక్రియ మళ్లీ జరిగేలా చూడాలని కోరారు. అటు గనులశాఖ డీడీ సైతం ఆంధ్ర జ్యోతి కథనాన్ని అమరావతిలోని గనులశాఖ డీఎంజీ దృష్టికి తీసుకువెళ్లారు. మరో పక్క సర్వేయర్ గలీజు దందా సంచలనంగా మారడంతో శనివారం కార్యాల యానికి సదరు ఉద్యోగి డుమ్మా కొట్టారు. ఇదంతా ఒకెత్తయితే మైనింగ్ స్కెచ్‌లను విక్రయించిన సదరు రాజమహేంద్రవరం ఏడీ కార్యాలయ సర్వేయర్ బండా రం మరింత బయటపడుతోంది. మూడు రోజుల్లో స్కెచ్ లు విక్రయించి వెనకేసింది రూ.కోటికిపైనే అని సమాచా రం.తనకు ముడుపులు ముట్ట జెప్పిన దరఖాస్తుదా రులకు మైనింగ్ స్కెచ్‌లు ఇవ్వడంతోపాటు ఫస్ట్ కం ఫస్ట్ విధానంలో లీజులు దక్కుతుండడంతో అవి వచ్చేలా చేయడం కోసం కొందరు లీజుదారులతో వ్యా పారంలో వాటాలు ఖాయం చేసుకోవడం విశేషం. ఇదంతా తెలిసిన అధికారులే ఖంగుతింటున్నారు.. ఇక ఆదివారం జరిగే సమీక్షలో ఏం నిర్ణయం తీసుకుంటారో..