Share News

పక్కాగా.. స్కెచ్‌

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:19 AM

గనులశాఖలో చిన్న తరహా ఖనిజాలు దక్కిం చుకునేందుకు ఉమ్మడి జిల్లాలో నెలకొన్న భారీ పోటీ ఆ సర్వేయర్‌కు లక్షల్లో కాసుల వర్షం కురి పించింది.

పక్కాగా.. స్కెచ్‌

మైనింగ్‌ స్కెచల విక్రయం

రూ.3 లక్షలు వసూలు

అరకోటికిపైగా గుంజుడు

లక్షల్లో ముట్టజెబితే స్కెచలు

మిగిలినవారికి జెల్ల

53 దరఖాస్తులు

ఒక్క రౌతులపూడికే 45

(కాకినాడ- ఆంధ్రజ్యోతి)

గనులశాఖలో చిన్న తరహా ఖనిజాలు దక్కిం చుకునేందుకు ఉమ్మడి జిల్లాలో నెలకొన్న భారీ పోటీ ఆ సర్వేయర్‌కు లక్షల్లో కాసుల వర్షం కురి పించింది. ఫస్ట్‌ కం ఫస్ట్‌ విధానంలో ముందుగా మైనింగ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికే లీజు దక్కనుండడంతో సదరు ఉద్యోగి ఇదే అదనుగా స్కెచలకు బేరం పెట్టేశాడు. దరఖాస్తుకు తోడు మైనింగ్‌ స్కెచ పక్కాగా ఉంటేనే లీజు దక్క నుండడాన్ని అసరాగా చేసుకుని భారీగా పిండే శాడు. ఉచితంగా ఇవ్వాల్సిన మైనింగ్‌ స్కెచలకు హెక్టారుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా మూడు రోజుల వ్యవధిలో సదరు సర్వేయర్‌ అర కోటికిపైగానే జేబులో వేసేసుకున్నాడు.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మైనింగ్‌ లీజులకు 53 దరఖాస్తులు రాగా 45 ఒక్క రౌతులపూడిలో క్వారీలకే వచ్చాయి. ఇందు లో సదరు సర్వేయర్‌ తనకు భారీగా ముట్టజె ప్పిన రెండు కంపెనీలకు 15 దరఖాస్తులు దఖలు చేయించడం విశేషం.

తొలుత వచ్చిన వారికే..

గత వైసీపీ హయాంలో కుదేలైన మైనింగ్‌ రంగానికి పునర్జీవం కల్పించేలా ఈ ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం మినరల్‌ పాలసీ-2025 తెచ్చిం ది. ఖనిజ నిబంధనలు సవరిస్తూ కిందటి గురు వారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం మైనింగ్‌ లీజులకు ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే గనులు కేటాయించేలా ప్రభు త్వం నిర్ణయించింది. ఫస్ట్‌ కం ఫస్ట్‌ అప్లికేషన విధానం అమల్లోకి తెచ్చింది.ఈ నేపథ్యంలో గత నెల 30 నుంచి ఈ నెల 1,2 తేదీల్లో అనేక మంది మైనింగ్‌ వ్యాపారులు క్వారీల్లో నల్లరా యికి పోటీ పడ్డారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యా ప్తంగా పోటీ తీవ్రంగా నెలకొంది. మైనింగ్‌ స్కెచ పక్కాగా ఉంటేనే లీజు మంజూరవు తుం ది. గనులశాఖ ఈ స్కెచలను దరఖాస్తుదా రులకు ఉచితంగా ఇవ్వాలి.ఎందు కంటే లీజు దారుడు దరఖాస్తు సమయంలోనే హెక్టారు మైనింగ్‌ తవ్వకానికి రూ.80 వేలు చొ ప్పున చెల్లిస్తాడు.రూ.5 వేలు సర్వే ఫీజు కట్టాలి.

ఇక్కడా వైసీపీ నేతలే..!

అప్లికేషన ఆనలైనలో దా ఖలు చేయడానికి సమయం పట్టడం, కొత్త వ్యాపారులకు అవగా హన లేకపోవడంతో సదరు సర్వేయర్‌ ఏకంగా ఎనిమిది మందిని పురమాయించి రాజమహేం ద్రవరంలో ఓ అపార్ట్‌మెంట్‌ నుంచి వంద హెక్టా ర్ల మైనింగ్‌ కోసం వ్యాపారుల తరపున 15 లీజు దరఖాస్తులు చేయించారు.కాకినాడ గనుల శాఖ లో అవుట్‌సోర్సింగ్‌ మాజీ మహిళా ఉద్యోగి సైతం కొందరు వ్యాపారుల తరపున దరఖా స్తులు దాఖలు చేశారు.ఇదిలా ఉంటే వచ్చిన దరఖాస్తులను సోమవారం నుంచి పరిశీలించి ఎవరు ముందుగా లీజులకు దరఖాస్తు చేశారు? స్కెచలు ఎవరివి పక్కాగా ఉన్నాయో నిర్దారించి లీజులు ఖరారు చేయనున్నారు.దరఖాస్తుల్లో అనేక మంది వైసీపీ వ్యాపారులు ఉండడంతో లీజుల కోసం వీరు సైతం చక్రం తిప్పుతున్నారు.

రౌతులపూడికే డిమాండ్‌..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 53 మైనింగ్‌ దరఖా స్తులు ఆనలైనలో రాగా ఇందులో 45 దరఖా స్తులు ఒక్క రౌతులపూడిలోని నల్లరాతి క్వారీలకే దాఖలయ్యాయి. మిగిలినవి పెద్దాపురం గ్రావెల్‌, జెడ్‌.అన్నవరం, వాలుతిమ్మాపురం ప్రాంతాలకు దాఖలయ్యాయి. రౌతులపూడిలోని వందల హెక్టా ర్లలో క్వారీలకు 45 దరఖాస్తులు పడ్డాయి.

పక్కాగా స్కెచవేసి కొట్టేశాడు..

ఉమ్మడి జిల్లాలో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని గనుల శాఖ కార్యాలయాల్లో సర్వే యర్ల వద్ద మైనింగ్‌ స్కెచలు అందుబాటులో ఉంటాయి. లీజుదారులు వీటిని దక్కించు కునేం దుకు ప్రయత్నించారు. ఖనిజ నిబంధనలు విడుదలవడానికి కొన్ని రోజుల ముందే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గను ల శాఖ సర్వేయర్‌ వీటిపై కన్నేశాడు. ఈయన పదిహేనేళ్ల నుంచీ ఇక్కడే పాతుకు పోయాడు. కాకినాడ సర్వేయరేమో జూనియర్‌. కాకినాడ కా ర్యాలయంలో ఉన్న స్కెచలన్నీ అవసరం పేరు తో సదరు రాజమహేంద్రవరం గనులశాఖ సర్వే యర్‌ ముందే రప్పించేశాడు. గనులశాఖ అను మతించిన ప్రైవేటు సర్వేయర్ల వద్ద స్కెచలను పరిశీలన పేరుతో ముందుగానే రప్పించుకున్నా డు.ఆ తర్వాత ఇక్కడి నుంచే కథ నడిపాడు. స్కెచలను హెక్టారుకు రూ.3 లక్షల వరకు సద రు సర్వేయర్‌ విక్రయించాడు. కొందరు వ్యాపా రులు 5, 10, 15 హెక్టార్లకు అప్లికేషన్లు దాఖలు చేయగా ఈ పెద్ద స్కెచలకు రూ.10 లక్షల వరకు డబ్బులు గుంజేశాడు. రౌతులపూడి క్వారీ లకు డిమాండ్‌ ఉండడంతో సుమారు 60 క్వారీల స్కెచలు తన వద్దే ఉంచుకున్నాడు. స్కెచ ఉన్న దరఖాస్తుదారుడికి లీజు అవకాశా లు పుష్కలంగా ఉండడంతో అనేక మంది వ్యాపారులు వీటిని సదరు సర్వేయర్‌ వద్ద కొను గోలు చేశారు.రవి అనే వ్యాపారి సత్య ఇంజ నీరింగ్‌ పేరుతో పలు పేర్లు మార్చి ఏడు దర ఖాస్తులు దాఖలు చేశారు.ఈ మైనింగ్‌ ప్రాంతం స్కెచలన్నీ ఈయన ముందే కొనేశాడు. సదరు సర్వేయర్‌ అడ్డంగా సహకరించాడు. రౌతులపూ డి క్వారీకి సంబంధించి దాదాపు 28 మంది వ్యాపారులు లక్షలకు లక్షలు సర్వేయరుకు ము ట్టజెప్పారు. మెట్ట ప్రాంతానికి చెందిన ఓ కాం ట్రాక్టర్‌ కంపెనీ ఆరు దరఖాస్తులు చేయగా స్కెచలకు భారీగా ముట్టజెప్పింది. సదరు ఉద్యోగి మూడు రోజుల వ్యవధిలో అర కోటిపైనే జేబు నింపేసుకున్నాడు. కాకినాడ సర్వేయర్‌ జూనియర్‌ కావడం రాజమహేంద్రవరం ఏడీ కార్యాలయ సర్వేయర్‌కు బాగా కలిసొచ్చింది.

ఒక సర్వేయర్‌ గలీజు పని!

అమల్లోకి మైనింగ్‌

కొత్త పాలసీ

14 వరకు సీనరేజి కాంట్రాక్టు గడువు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మైనర్‌ మి నరల్‌ పాలసీ, ఇసుక ఉచిత విధానంతో కొత్త మైనింగ్‌ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు గత నెల 26వ తేదీనే ఆంధ్రప్రదేశ ప్రభుత్వ గెజిట్‌లో నోటిఫికేషన విడుదల చేశా రు. దీంతో జిల్లాలో చాలా కాలం తర్వాత మైనింగ్‌ సందడి మొదలైంది. మాన్యువల్‌గానే ఇసుక తీయాలని కొత్త పాలసీలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం డీసిల్టేషనకే అను మతి ఉందని.. ఓపెన రీచలలో ఇసుక తవ్వ కాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో మైనింగ్‌ విధానం ధ్వం సమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌ 29న కొత్తపాలసీపై ప్రభుత్వం ఓ సర్క్యులర్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. దానిని అధికా రికంగా అమల్లోకి తెచ్చారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బిల్డింగ్‌,రోడ్‌ మెటల్‌, గ్రా నై ట్‌,గ్రావెల్‌, లేటరైట్‌ గనులు ఉన్నాయి. అప్పట్లో 250 లీజు దరఖాస్తులను వైసీపీ పెండింగ్‌లో పెట్టింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వా టిని పరిశీలించి అర్హులకు లీజు ఇవ్వనుంది. కొత్త దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముందు పాతవి క్లియర్‌ చేయనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన సర్కుల్యర్‌, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ) ప్రకారం 2023 మార్చి 13 నాటికి ఫైలైన పెండింగ్‌ మినరల్‌ కన్సెషన దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించనున్నారు. అర్హత ఉంటే ఆమోదం తెలిపి డిపాజిట్‌ కట్టించుకుంటారు.గ్రానైట్‌, మార్బుల్‌, బిల్డింగ్‌ మెటీరియల్‌కు తాజాగా దరఖాస్తు చేసుకోవా లి. ఇండస్ర్టియల్‌ మినరల్‌ కోసం వేలం పద్ధతి ఉంటుంది. దరఖాస్తులన్నీ ఆనలైనలో జరుగు తాయి. రోడ్‌ మెటల్‌ హెక్టారుకు రూ.80 వేలు, గ్రావెల్‌కు రూ. 65 వేలు, గ్రానైట్‌కు రూ. లక్షా 85 వేల వరకూ డిపాజిట్‌ చేయవలసి ఉంది.

14 వరకూ సీనరేజి కాంట్రాక్టు

సీనరేజి కాంట్రాక్టు గడువు ఈ నెల 14వ తేదీ తేదీ వరకూ ఉంది. గతంలో మైనింగ్‌ అధికా రులే సీనరేజి వసూలు చేసేవారు.కానీ వైసీపీ ప్రైవేట్‌ కాం ట్రాక్టరుతో ముందుగానే డిపాజిట్‌ కట్టించు కుని సీనరేజీ వసూళ్లను అప్పగిం చింది.ఇది చాలా మందికి ఇబ్బంది కరంగా మారింది.మరి ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ తర్వాత ఏం చేస్తుందో చూడాలి.

Updated Date - Jul 05 , 2025 | 01:19 AM