Share News

శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు కల్పిస్తా

ABN , Publish Date - May 08 , 2025 | 12:47 AM

యానాం మెట్టకుర్రు వార్డు పరిధిలో ఉన్న శ్మశానవాటికకు కనీస సౌకర్యాలు కల్పించాలని సమీప గ్రామాల ప్రజలు కోరారు. బుధవారం ఉదయం గ్రామస్తులతో కలిసి శ్మశానవాటికను పుదుచ్చేరి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు.

శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు కల్పిస్తా

యానాం, మే7(ఆంధ్రజ్యోతి): యానాం మెట్టకుర్రు వార్డు పరిధిలో ఉన్న శ్మశానవాటికకు కనీస సౌకర్యాలు కల్పించాలని సమీప గ్రామాల ప్రజలు కోరారు. బుధవారం ఉదయం గ్రామస్తులతో కలిసి శ్మశానవాటికను పుదుచ్చేరి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. శ్మశానవాటిలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని మల్లాడి హామీ ఇచ్చారు. అక్కడ నుంచే సంబంధిత ఉన్నతాధికారులతో మల్లాడి ఫోన్‌లో మాట్లాడారు. చేపట్టాల్సిన పనులపై చర్యలు తీసుకోవాలని అఽధికారులను కోరారు. శ్మశానవాటికలో ఒక పర్యవేక్షకుడిని గ్రామస్తులు ఏర్పాటుచేస్తే, అతడికి ప్రతినెల తానే జీతాభత్యాలు సమకురుస్తానని చెప్పారు. కార్యక్రమంలో గణపతినగర్‌, మెట్టకుర్రు, ఆధిఆం ధ్రపేట, రమబాయినగర్‌, వంశీకృష్ణాకాలనీ, ఫిషర్‌మెన్‌పేట, రామన్నకోడు సమీప గ్రామల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 12:47 AM