మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:59 AM
ప్ర భుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా నాణ్యతతో అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ సూచించారు

అంబాజీపేట, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ప్ర భుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా నాణ్యతతో అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ సూచించారు. పుల్లేటికుర్రు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. భోజనం తయారుచేసే ప్రాంతాన్ని శుభ్రం గా ఉంచుకోవాలని సూచించారు. కుళ్లిన కోడిగుడ్లు ఉంటే తక్షణమే వాటిని మార్పు చేసేందుకు హెచ్‌ఎంకు తెలియజేయాలన్నారు. అనంతరం స్టాక్‌పాయింట్ రికార్డులు, భోజన తయారు చేసే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. డీఈవో షేక్ సలీంబాషా, డీఎస్‌వో అడపా ఉదయ్‌భాస్కర్, సివిల్ సప్లయి మేనేజర్ బాలసరస్వతి, ఎంఈ వోలు కె.వెంకటేశ్వరరావు, మోకా ప్రకాష్, తూనికులు, కొలతల అధికారి రాజేష్, హెచ్‌ఎం కనకదుర్గ పాల్గొన్నారు. అనంతరం ముక్కామలలో రేషన్‌షాపులను ఆయన తనిఖీ చేశారు.
నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
పి.గన్నవరం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్‌లో భోజనాలు మెనూ ప్రకారం అందించకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఫుడ్‌కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ హెచ్చరించారు. గురువారం నరేంద్రపురం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ఆయన మాట్లాడారు. మధ్యాహ్న భోజ నం బాగాలేదని, చిక్కిలు ఇవ్వడం లేదని విద్యా ర్థులు వినతిపత్రాన్ని అందించారు. ముంగండ రేషన్‌షాపులో ఆయన తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, సివిల్ సప్లయి అధికారుల, లీగల్ మెట్రాలజీ, ఫుడ్‌సేప్టీ అధికారులు పాల్గొన్నారు.