మెట్లోత్సవం... మహదానందం..
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:48 AM
అన్నవరం, డిసెంబరు 15 (ఆంధ్ర జ్యోతి): తన దర్శనార్థం ఎంతో ప్రయాసతో న డకమార్గంలో సన్నిధానానికి చేరేందుకు తోడ్పడి న మెట్లకు సత్యదేవుడు సమక్షంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కాకినాడ జిల్లా అన్నవరం దేవ స్థానంలో సోమవారం మెట్లోత్సవం వేడుకను ని ర్వహించారు. ధనుర్మాసం ప్రారంభంలో
సత్యదేవుడి సన్నిధిలో మెట్టు మెట్టుకు పూజలు
పోటాపోటీగా పసుపు, కుంకుమ పూసిన మహిళలు
అన్నవరం, డిసెంబరు 15 (ఆంధ్ర జ్యోతి): తన దర్శనార్థం ఎంతో ప్రయాసతో న డకమార్గంలో సన్నిధానానికి చేరేందుకు తోడ్పడి న మెట్లకు సత్యదేవుడు సమక్షంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కాకినాడ జిల్లా అన్నవరం దేవ స్థానంలో సోమవారం మెట్లోత్సవం వేడుకను ని ర్వహించారు. ధనుర్మాసం ప్రారంభంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం 7 గంటలకు స్వామి,అమ్మవార్లను కొండపై నుంచి దిగువకు తీసుకొచ్చి గ్రామోత్సవం నిర్వహించి 9గంటలకు తొలిపావంచా వద్ద పల్లకీలో ఆశీనులు గావించి వైదికబృందం ఆధ్వర్యంలో గ ణపతిపూజ, పుణ్యాహవచనం అనంతరం స్వా మి, అమ్మవార్లకు అష్టోత్తర శతనామాలతో అర్చించారు. అనం తరం వేదపండితు లు మహదాశీర్వచ నం అందించారు. తొలిమెట్టుకు ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ పూసి పుష్పార్చన అనంతరం హారతులిచ్చిచ్చారు. తొలిమెట్టు దగ్గర నుంచి ప్రధానాలయం మెట్లవరకు స్వామి,అమ్మవార్లను పల్లకీలో తీసుకొస్తుండగా మహిళా భక్తులు పోటాపోటీగా మెట్లకు పూజలు చేసుకుం టూ ఆనందంగా విచ్చేశారు. కార్యక్రమంలో పా ల్గొన్న మహిళలకు దేవస్థానం ప్రత్యేక దర్శన సౌ కర్యం కల్పించింది. వైదిక కార్యక్రమాలను ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, చామర్తి కన్నబాబు, పాలంకి చినపట్టాభి తదిత రులు నిర్వహించగా దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నుంచి ధనుర్మాసం పూర్తయ్యేవరకు నిత్యం సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లకు గ్రామంలో వెండిపల్లకీతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపుడైన సత్యదేవుడు తమ ఇంటి మార్గం నుంచి వెళ్తుండడంతో గ్రామస్థులు ఆనందపరవసులై హారతులిస్తుంటారు.