సత్యదేవుడి సన్నిధిలో 15న మెట్లోత్సవం
ABN , Publish Date - Dec 13 , 2025 | 01:34 AM
అన్నవరం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి ఆలయంలో ధనుర్మాస ప్రారంభసూచికగా ఈనెల 15న మె ట్లోత్సవం నిర్వహించనున్నట్టు ఈవో త్రినాథరా వు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7గంటలకు స్వామి,అమ్మవార్లను గ్రామసేవకు తీసుకెళ్లి 9గంటలకు తొలిపావంచా
16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు
వెల్లడించిన ఈవో త్రినాథరావు
అన్నవరం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి ఆలయంలో ధనుర్మాస ప్రారంభసూచికగా ఈనెల 15న మె ట్లోత్సవం నిర్వహించనున్నట్టు ఈవో త్రినాథరా వు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7గంటలకు స్వామి,అమ్మవార్లను గ్రామసేవకు తీసుకెళ్లి 9గంటలకు తొలిపావంచా తొలిమెట్టు వద్ద ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రధానాలయం వరకు ఉన్న సుమారు 450 మెట్లుండగా మెట్టుమెట్టుకు పసుపు,కుంకుమలు పూసి, హారతులిచ్చి, నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ సందర్భం గా మెట్లమార్గాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 16 నుంచి నెలరోజుల పాటు ధనుర్మాసం సందర్భంగా స్వామి,అమ్మవార్లకు నిత్యం వెండి పల్లకీలో గ్రామోత్సవం జరుపుతారు.
30న సత్యదేవుడి ఉత్తరద్వార దర్శనం
వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఈనెల 30న సత్యదేవుడి ఉత్తరద్వార దర్శనం కల్పిస్తున్నామని, ఉదయం 5గంటల నుంచి ఉ త్తరద్వార దర్శనానికి భక్తులను అనుమతించడం జరుగుతుందని ఈవో తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే వైకుంఠానికి చేరుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో వైష్ణవ ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేస్తుంటారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.