Share News

మెగా పీటీఎం 2.0ను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jul 09 , 2025 | 01:06 AM

రేపు నిర్వహించబోయే మెగా పీటీఎం 2.0ను విజయవంతం చేయాలని ఆర్జేడీ జి.నాగమణి ఉపాధ్యాయులకు సూచించారు. బిక్కవోలు ఉన్నత పాఠశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వర్క్‌బుక్స్‌ పరిశీలించారు.

మెగా పీటీఎం 2.0ను విజయవంతం చేయాలి
పందలపాక హైస్కూల్లో విద్యార్థులతో యెగాసానాలతో వేసిన మెగా పీటీఎం 2.0 లోగో

  • ఆర్జేడీ నాగమణి

  • బిక్కవోలులో జిల్లా పరిషత్‌, మోడల్‌ ప్రాథమిక పాఠశాలల సందర్శన

బిక్కవోలు, జూలై 8(ఆంధ్రజ్యోతి): రేపు నిర్వహించబోయే మెగా పీటీఎం 2.0ను విజయవంతం చేయాలని ఆర్జేడీ జి.నాగమణి ఉపాధ్యాయులకు సూచించారు. బిక్కవోలు ఉన్నత పాఠశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వర్క్‌బుక్స్‌ పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మెగా పీటీఎం 2.0 సమవేశ ఏర్పాట్లపై చర్చించారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు తప్పనిసరిగా సమావేశానికి హాజరయ్యేలా చూడాలన్నారు. హోలిస్టిక్‌ కార్డులు అందజేసి విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులతో చర్చించి, భవిష్యత్‌లో పిల్లలను ఏవిధంగా తయారు చేయాలన్నదీ తెలుసుకోవాలన్నారు. విద్యార్థులందరూ ఎస్‌ఆర్‌కేవీ కిట్లతో యూనిఫారమ్‌ ధరించి వచ్చేలా చూడాలన్నారు. తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలన్నారు. అమ్మ పేరుతో ఒక మొక్కను విద్యార్థులందరికీ అందించి వారి ఇళ్ల వద్ద వేసేలా చర్చలు తీసుకోవాలన్నారు. డొక్కా సీతమ్మ భోజనాన్ని అతిథు లకు, అధికారులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందిచాలన్నారు. సమావేశ నిర్వహణకు వేసిన కమిటీలతో మెగా పీటీఎం 2.0ను సమర్ధవంతగా నిర్వహించాలని హెచ్‌ఎం రమాదేవికి సూచించారు. అనంతరం గ్రామంలో మోడల్‌ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్జేడీ వెంట ఎంఈవో సీహెచ్‌వీవీ సత్యనారాయణ ఉన్నారు.

  • మెగా పీటీఎం 2.0 ఆకృతి

మండలంలోని పందలపాక ఉన్నత పాఠశాల విద్యార్థులు రేపు నిర్వహించబోయే మెగా పీటీ ఎం 2.0కు ముందుగా యోగసనాలతో మెగా పీటీఎం 2.0 ఆకృతి వేసి అందర్నీ ఆకట్టుకున్నా రు. మంగళవారం పాఠశాలలో హెచ్‌ఎం చిర్ల శ్రీనివాసరెడ్డి, పీడీ ద్వారంపూడి యువరాజారెడ్డిల ఆధ్వర్యంలో 550మంది విద్యార్థులతో మెగా పీటీఎం 2.0 ఆకృతిని వేయించారు.కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 01:06 AM