Share News

నేడో.. రేపో..!

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:48 PM

మెగా డీఎస్సీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారి కి కూటమి సర్కారు శుభవార్త వినిపించినా.. తుది ఫలితాల విడుదల్లో జాప్యంపై గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈనెల ఒకటో తేదీన కీ విడుదల చేసిన విద్యాశాఖ ఈనెల 15లోపు మెగా డీఎస్సీ-2025 ఫలితాలను విడుదల చేస్తామని ఆరోజే ప్రకటించింది. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. ఇప్పటికే కీ పరిశీలనతో ఓ నిర్ణయానికి వచ్చిన అభ్యర్థులు మెరిట్‌ జాబితా కోసం ఆశగా ఎదురు

నేడో.. రేపో..!

మెగా డీఎస్సీ మెరిట్‌ జాబితా విడుదలయ్యే అవకాశం

అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు బృందాల ఏర్పాటు

ఉమ్మడి జిల్లాలో మొత్తం టీచర్‌ పోస్టులు 1241

పరీక్షలు రాసింది 38,617 మంది

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

మెగా డీఎస్సీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారి కి కూటమి సర్కారు శుభవార్త వినిపించినా.. తుది ఫలితాల విడుదల్లో జాప్యంపై గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈనెల ఒకటో తేదీన కీ విడుదల చేసిన విద్యాశాఖ ఈనెల 15లోపు మెగా డీఎస్సీ-2025 ఫలితాలను విడుదల చేస్తామని ఆరోజే ప్రకటించింది. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. ఇప్పటికే కీ పరిశీలనతో ఓ నిర్ణయానికి వచ్చిన అభ్యర్థులు మెరిట్‌ జాబితా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, నెలాఖరునాటికి కొత్త టీచర్ల పోస్టింగులు, శిక్షణ అన్నీ చకచకా జరిగిపోతాయని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇంకా ఫైనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేయకపోవడంపై నిరాశ చెందుతున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డీఎస్సీకి ఎక్కువ మంది దరఖాస్తు చేశారు. అన్ని మేనేజ్‌మెంట్లకు కలిపి 1241 పోస్టులు ఉండగా 63,004 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పో స్టుకు సగటున 50 దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయుతే ఈసారి పురుషుల కన్నా మహిళలే దరఖాస్తు నమోదులో ముందున్నారు. కేటగిరీల వారీగా ఓసీ-5120, బీసీ-ఏ 2810, బీసీ-బీ 6991, బీసీ-సీ 554, బీసీ-డీ 3636, బీసీ-ఈ 568, ఎస్సీ గ్రేడ్‌-1 87, ఎస్సీ గ్రేడ్‌-2 2572, ఎస్సీ గ్రేడ్‌-3 10,066, ఎస్టీ 6,213, ఈడబ్ల్యూఎస్‌ 3,782, అలాగే దివ్యాంగుల కేటగిరీ నుంచి వీహెచ్‌ 159, హెచ్‌హెచ్‌ 36, ఓహెచ్‌ 847, ఎంఐ ఆరుగురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌ ఆరు నుంచి జూలై ఏ డు వరకు 26 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు.

పోస్టుల వివరాలు..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1241 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ 608, పీఈటీలు 210, ఎస్జీటీ 423 పోస్టులు ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు తెలుగు 65, హిందీ 78, ఆంగ్లం 95, గణితం 64, ఫిజికల్‌ సైన్స్‌ 71, బయోలాజికల్‌ సైన్స్‌ 103, సోషల్‌ 132, వ్యాయామవిద్య 210 ఉద్యోగాలతో పాటు సెకండరీ గ్రేడ్‌ టీచర్ల ఉద్యోగాలు ఉన్నాయి. ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమానికి సంబంధించి ఫిజికల్‌ సైన్స్‌ 3, బయోలాజికల్‌ సైన్స్‌ 4, స్కూల్‌ అసిస్టెంట్‌ వ్యాయామ విద్య 1, ఎస్జీటీలు 104 మొత్తం 112 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రత్యేక విద్యకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 13 టీజీటీలు, 3 పీఈటీలు, 15 ఎస్జీటీలతో కలిపి 31 పోస్టులు ఉన్నాయి. జోన్‌-2 (ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా)కు సంబంధించి ఏపీఆర్‌ఎస్‌, ఏపీఎంఎస్‌, ఏపీఎస్‌డబ్ల్యూ, బీసీ, సోషల్‌ వెల్ఫేర్‌కు సంబంధించి పీజీటీ 49, టీజీటీ 272, పీడీ 3, పీఈటీ 24తో కలిపి మొత్తం 348 ఉపాధ్యాయపోస్టులు భర్తీ చేయనున్నారు.

జాప్యానికి కారణాలు...

మెరిట్‌ జాబితా విడుదల్లో జాప్యానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. టెట్‌ మార్కులను కొందరు అభ్యర్థులు తప్పులతడకలుగా పొందుపరచడం, నార్మలైజేషన్‌ ప్రక్రియలు, న్యాయస్థానాల్లో ఉన్న అభ్యంతరాలను అధిగమించడం, వరుస సెలవుదినాలు రావడం వంటి పలు కారణాలతో విడుదల ఆలస్యమవుతోందనే ప్రచారం సాగుతోంది. టెట్‌ మార్కులపై అభ్యంతరాలను స్వీకరించి మారిన మార్కులతో సవరించిన డీఎస్సీ తుది మార్కుల స్కోర్‌ కార్డులను ఈనెల 14న విడుదల చేశారు. ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో మార్కులు ఉంచారు. ఇంకా టెట్‌ మార్కులపై ఎవ రికైనా అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో పంపవచ్చని సూచించారు. అలా వచ్చిన వాటిని పరిశీలించి తుది మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నారు. అయితే ఈనెల 18 నాటికి విడుదలయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. అనంతరం మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ విధానంలో టీచర్‌ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లాలో డీఎస్సీ పోస్టులకు సంబంధించి అన్ని ముం దస్తు ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయరాజు ఆదేశించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రతి 50 మం దికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ జిల్లాలో 25 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక ఎంఈఓ, హెచ్‌ఎం, డిప్యూటీ తహశీల్దార్‌ ఉండేలా చూశారు.

ఆ వివరాలు పంపండి..

డీఎస్సీ 2025లో నోటిఫై చేయబడిన పోస్టుల సంఖ్య, మేనేజ్‌మెంట్‌ వారీగా, కేటగిరీ వారీగా, మీడియం, సబ్జెక్టుల వారీగా వివరాలు పంపాలని ఇప్పటికే డీఈవో, ఆర్‌జేడీలకు ఉత్తర్వు లు జారీ చేసినట్టు తెలిసింది. ఆగస్టు 31, 2025 నాటికి అందు బాటులో ఉన్న ఖాళీల సంఖ్య, డీఎస్సీ 2025లో ఖాళీలను భర్తీ చేయడానికి పాఠశాలలను గుర్తించడం, కేటగిరీ-4/3లో ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, బదిలీ చేయబడిన కానీ, బదిలీ చేసిన, రిలీవ్‌ కాని ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు, ఇలా పలు వివరాలు పంపాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ నుంచి ఉత్తర్వులు అందినట్టు చెబుతున్నారు.

ఈ సారి పోటీ అధికమే..

డీఎస్సీకి ఈసారి పోటీ అధికంగానే ఉంది. ఎస్‌జీటీ పోస్టులకు డీఎడ్‌ శిక్షణ పొందిన వారు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బీఎడ్‌ శిక్షణ పొందిన వారు అర్హులు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కూడా పోటీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35 వేల నుంచి 40 వేలమంది పోటీ పడనున్నారు. 2018 డీఎస్సీలో ఒక పోస్టుకు 101 మంది పోటీపడ్డారు. ఎస్‌జీటీలో ఒక్కో ఖాళీకి 101 మంది పోటీపడగా, స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో ఒక్కో పోస్టుకు 124మంది పోటీపడ్డారు. స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వే జ్‌ పోస్టుల్లో ఒక్కో పోస్టుకు 94 మంది పోటీపడ్డారు. ఆ లెక్కన చూస్తే ప్రస్తుత డీఎస్సీలో పోటీ అధికంగానే ఉందని భావిస్తున్నారు.

Updated Date - Aug 16 , 2025 | 11:48 PM