బోట్‌లోనే జిల్లా కలెక్టర్ సమీక్ష
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:15 AM
2027లో గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రత, పారిశుధ్యంపై అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు.
కొవ్వూరు,అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): 2027లో గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రత, పారిశుధ్యంపై అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో గురువా రం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఏపీ టూరిజం బోట్‌లో పర్యటించి స్నానఘట్టాలను పరిశీలించారు. గోష్పాదక్షేత్రం నుంచి కృష్ణచైతన్య, భక్తాంజనేయ, సుబ్రహ్మణ్యఘాట్, పిండప్రదానం రేవు, క్రిస్టియన్ బరియల్ గ్రౌం డ్, హేవలాక్ వంతెన, శ్రీనివాస స్నానఘట్టం, ఏరినమ్మ ఘాట్‌లను బోట్‌లో నుంచే పరిశీలించారు. బోటులోనే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి.. మంత్రుల బృందంతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. జిల్లా స్థాయిలో అన్నిశాఖల అధికారులు సమన్వయం తో ముందస్తు సన్నాహాలు వేగవంతం చేసే విధానంలో ప్రధాన ఘాట్లను పరిశీలించినట్టు చెప్పారు. త్వరలో రాష్ట్రస్థాయి పర్యవేక్షక బృం దం జిల్లాలో పర్యటించే అవకాశం ఉందన్నారు.
పర్యాటక ప్రాజెక్టుపై సమీక్ష
కొవ్వూరులో గోదావరి ఒడ్డున నిర్మాణంలో ఉన్న పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 26 కాటేజ్‌లు, బార్, రెస్టారెంటు, స్విమ్మింగ్ ఫూల్, కాన్ఫరెన్స్ హాలు వం టి సౌకర్యాలతో 60 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు త్వరితగతిన ప్రా రంభించి పుష్కరాలకు ముందే పూర్తి చేయాలన్నారు. ద్విసభ్య కమిటీ సభ్యుడు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, ఇరిగేషన్ ఈఈ జి.శ్రీనివాస్, జిల్లా టూరిజం అధికారి పి.వెంకటాచలం, ఆర్డీ వో రాణి సుస్మిత, సూరపనేని చిన్ని, కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ, బర్ల శ్రీనివాసరావు, శ్రీవత్సవ కన్సల్‌టెంట్ బి.కిరణ్, తహశీల్దార్ ఎం.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.