Share News

వైద్య సేవల్లో నిరక్ష్యాన్ని సహించం

ABN , Publish Date - Dec 05 , 2025 | 01:04 AM

ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సేవలందించడంలో వైద్యు లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండంలోని రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తని ఖీ చేశారు.

 వైద్య సేవల్లో నిరక్ష్యాన్ని సహించం
ఓపీ లేకపోవడంపై వైద్యాధికారిని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి

  • ఎమ్మెల్యే నల్లమిల్లి

  • రామవరం పీహెచ్‌సీలో తనిఖీలు

  • వైద్యులు, సిబ్బంది పనితీరుపై ఆగ్రహం

అనపర్తి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సేవలందించడంలో వైద్యు లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండంలోని రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తని ఖీ చేశారు. ఉదయం 9.35 నిమిషాలకు ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యేకు అక్కడ వైద్యులు గాని, సిబ్బంది గానీ లేరు. కొద్ది సేపటికి డాక్టర్‌, కొంత మంది సిబ్బం ది వచ్చారు. వైద్యులు గానీ సిబ్బంది గానీ అందుబాటులో ఉండడం లేద ని, మందులు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదంటూ వారం పది రోజులుగా తనకు పలువురు ఫిర్యాదు చే శారన్నారు. వారం రోజుల ఓపీ వివరాలను పరిశీలించిన ఆయనకు రోజు కు పది అంకె కూడా దాటకపోవడాన్ని గుర్తించి డీఎంహెచ్‌వోకు ఫోన్‌ చేసి పీహెచ్‌సీ పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు పేలవంగా ఉందని, క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకునే తీరిక అధికారులకు లేకుండా పోయిందన్నారు. ఈ విషయాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రామవరం పీహెచ్‌సీలో ఉన్న 16 మంది సిబ్బంది 9గంటలకే హాజరు కావలసి ఉండగా 9.35గంటలకు ఐదుగురు మాత్రమే హాజరయ్యారని,సి బ్బంది నిర్లక్ష్యం వల్ల రోగుల సంఖ్య కూడా తగ్గిందని ఇలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గిరిడా గంగాభవాని, సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి సు బ్బారెడ్డి, నాయకులు చింతా సురేష్‌రెడ్డి,నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, తేనెల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 01:04 AM