మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:12 AM
ఎటపాక, జూలై 25 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా ఎటపాక మండలానికి చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు కొవ్వాసి దేవే అలియాస్ సుమిత్ర పోలీసులు ఎదుట లొంగి పోయినట్టు ఓఎస్డీ జగదీష్ అడహిళ్లీ తెలిపారు. దీనికి సంబంధించి శుక్రవారం ఎటపాక పోలీస్ స్టేషన్‌లో విలేకర్లకు వివరాలను వెల్లడించారు. ఛ
ఎటపాక, జూలై 25 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా ఎటపాక మండలానికి చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు కొవ్వాసి దేవే అలియాస్ సుమిత్ర పోలీసులు ఎదుట లొంగి పోయినట్టు ఓఎస్డీ జగదీష్ అడహిళ్లీ తెలిపారు. దీనికి సంబంధించి శుక్రవారం ఎటపాక పోలీస్ స్టేషన్‌లో విలేకర్లకు వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లా కొంటా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గంగరాజపాడుకి చెందిన దేవే 22 ఏళ్ల వయసులో ఏరియా కమిటీ సభ్యుడు, కొంటా ఎల్‌వోఎస్ కమాండర్ మడకం కోసిని ఆదర్శంగా తీసుకుని దళంలో చేరినట్టు చెప్పారు. 2024 జనవరిలో ఈమెతో పాటు మడివి హిడ్మా బెటా లియన్ కమాండర్‌తో పాటు 900 మంది దళ సభ్యులు చత్తీస్‌గఢ్‌లోని ధర్మవరం పోలీస్ క్యాంపుపై దాడిలో పాల్గొన్నట్టు పేర్కొన్నారు. లొంగిపోయిన దేవే పై రూ.లక్ష రివార్డు ఉందని ఓఎస్డీ తెలిపారు. ఈయనతో పాటు సీఐ కన్నపరాజు, ఎస్‌ఐ అప్పలరాజు ఉన్నారు.