ఆ లేఖతో మాకు సంబంధం లేదు
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:52 AM
చింతూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఇటీవల మావోయిస్టుల పార్టీ పేరిట విడుదలైన లేఖతో తమకు ఎటు వంటి సంబంధం లేదని మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి లచ్చన్న సోమవారం ఖండించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామ
చింతూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఇటీవల మావోయిస్టుల పార్టీ పేరిట విడుదలైన లేఖతో తమకు ఎటు వంటి సంబంధం లేదని మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి లచ్చన్న సోమవారం ఖండించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట విప్లవ సంతకంతో ఓ లేఖ విడుదలైందన్నారు. ఆ లేఖలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, దుమ్ముగూడెంకు చెం దిన పలువురి రాజకీయ నాయకులు, ఓ పత్రికా విలేకరిని కూడా హెచ్చరించడం జరిగిందని లచ్చన్న పేర్కొన్నారు. ఇదంతా కొంతమంది పని గట్టుకుని చేస్తున్న దుష్ప్రచారమని, ఏజెన్సీలో గందరగోళం సృష్టించేందుకే ఈ తరహా ప్రకట నలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు.