ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ దోహదం
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:31 AM
మార్షల్ ఆర్ట్స్ ఆరోగ్యం కోసమే కాకుండా ఆత్మ రక్షణకూ దోహదపడుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ శత జయంతోత్సవాల సందర్భంగా జపాన్ షూటోకాన్ కరాటే కన్నిన్జు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అటల్‌జీ కరా టే టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తిలో రాష్ట్ర కరాటే పోటీలు
హాజరైన 1200 మంది విద్యార్థులు
అనపర్తి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మార్షల్ ఆర్ట్స్ ఆరోగ్యం కోసమే కాకుండా ఆత్మ రక్షణకూ దోహదపడుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ శత జయంతోత్సవాల సందర్భంగా జపాన్ షూటోకాన్ కరాటే కన్నిన్జు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అటల్‌జీ కరా టే టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ప్రతినిధి గుర్రాల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ ప్రస్తుత తరుణంలో మార్షల్ ఆర్ట్స్ బాలికలకు ఎంతో ఉపకరిస్తుందని ప్రమాద పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునేందుకు ప్రతి బాలిక కరాటేలో శిక్షణ పొందాలన్నారు. నాగేంద్ర మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్‌పై బాలికల్లో మక్కువ పెరగడం అభినందనీయమన్నారు. కాగా పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌కు ఆర్థిక సహకారం అందించిన తే తల ఉపేంద్రరెడ్డి, మేడపాటి చెల్లారెడ్డి, తాడి శశిధర్‌రెడ్డిలను, టోర్నమెంట్ నిర్వాహకుడు కర్రి నాగిరెడ్డిని ఎమ్మెల్యే సత్కరించారు.కార్యక్రమంలో ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకరరెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, గొల్లు హేమతులసి, మల్లిడి ఆదినారాయణరెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, ఎం.శ్రీను పాల్గొన్నారు.