Share News

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

ABN , Publish Date - May 12 , 2025 | 12:42 AM

యానాంజీఎంసీ బాలయోగినగర్‌లో బాల్య వివాహాన్ని అడ్డుకున్నట్టు యానాం చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కోఆర్డినేటర్‌ సం సాని రవికుమార్‌ తెలిపారు.

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

యానాం, మే 11(ఆంధ్రజ్యోతి):యానాంజీఎంసీ బాలయోగినగర్‌లో బాల్య వివాహాన్ని అడ్డుకున్నట్టు యానాం చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కోఆర్డినేటర్‌ సం సాని రవికుమార్‌ తెలిపారు. బాలయోగినగర్‌లో బాల్య వివాహం జరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులతో అక్కడికి వెళ్లి బాల్యవివాహాన్ని అడ్డుకు న్నట్టు రవికుమార్‌ తెలిపారు. ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చామ న్నారు. 18ఏళ్లు దాటితే వివాహం చేయాలని సూచించామన్నారు. బాల్యవివాహాలపై 1098కు సమాచారం ఇస్తే, వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

Updated Date - May 12 , 2025 | 12:42 AM