మార్కెట్‌కు చవితి శోభ
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:37 AM
ణ పతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజాన గరంలోని ప్రధాన రహదారి రద్దీగా మారింది. పూజా సామగ్రి, పండ్లు విక్రయదారులతో బ స్టాండ్, మార్కెంట్ ప్రాంతాలు చవితి శోభను సంతరించుకున్నాయి. పూజా సామగ్రి ధరలు ఆకాశాన్నంటాయి.
పూజా సామగ్రి విక్రయాలు
వినియోగదారులతో రద్దీ
ఆకాశాన్నంటిన ధరలు
ట్రాఫిక్ ఇబ్బందులు
రాజానగరం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): గణ పతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజాన గరంలోని ప్రధాన రహదారి రద్దీగా మారింది. పూజా సామగ్రి, పండ్లు విక్రయదారులతో బ స్టాండ్, మార్కెంట్ ప్రాంతాలు చవితి శోభను సంతరించుకున్నాయి. పూజా సామగ్రి ధరలు ఆకాశాన్నంటాయి. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సామగ్రి కొనుగోలకు రాజానగరం మార్కెట్‌కు వస్తారు. అసలే చవితి సందడి, ఆపై ప్రతి మంగళవారం జరిగే వారపు సంత కావడంతో మరింత రద్దీగా మా రింది. మార్కెట్ ప్రాంతంలో నెలకొన్న రద్దీతో ప్రయాణికులు, వాహనదారులు పడరాని పా ట్లు పడ్డారు. వ్యాపారులు, కొనుగోలుదారుల వా హనాలతో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యను సరిదిద్దాల్సిన పోలీసులు బస్టాండ్, మార్కెట్ ప్రాంతం వైపు కన్నెత్తి చూడలే దని పలువురు వాపోయారు. ని త్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో పర్వదినాలు, సంత రోజుల్లోనైనా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు, ప్రయా ణికులు కోరుతున్నారు.
చుక్కలనంటిన ధరలు..
బిక్కవోలు, ఆగస్టు 26 (ఆంధ్ర జ్యోతి): వినాయక చవితి సందర్భంగా పత్రి, పూజా సామగ్రి ధరలు చుక్కలనంటాయని భక్తులు వాపోతు న్నారు. గత యేడాది కన్నా ఈ యేడాది ధరలు విపరీతంగా పెంచేశారన్నారు. పాలవెల్లి రూ.10 0, పాలవిల్లికి కట్టే సీతాఫలం రూ.15, ఎలక్కా య రూ.15, మారేడు రూ.20, జామ రూ.10, నారింజ రూ.15, కలువ పువ్వు రూ.5, యాపిల్, బత్తాయిలు రూ.25 చొప్పున అమ్ముతు న్నార న్నారు. దీంతో పాలవెల్లికి గతంలో మూడుచొప్పున కట్టే వాటిని ఒకటితో సరిపెట్టుకుంటున్నామని భక్తులు తెలిపారు.