Share News

ముఖ్య గమనిక.. ఇళ్లకు రావద్దు!

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:09 AM

రంపచోడవరం, నవంబరు 21 (ఆంధ్ర జ్యోతి): అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో హిడ్మా, టెక్‌ శంకర్‌ వంటి కీలక నేతలతో పాటు 13 మంది మావోయిస్టులు మృతిచెందిన నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు మ న్యంలో సంచరించకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా ఆంక్షలు విధించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య హోదాల్లో ఉన్న నేతలెవరూ తమ నివాసాలకు రావొద్దని, మన్యానికి దూరం

ముఖ్య గమనిక.. ఇళ్లకు రావద్దు!

మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ప్రజాప్రతినిధులకు పోలీసుల ఆంక్షలు

మన్యంలోకి రాకుండా అధికార పార్టీ ముఖ్య నేతలకు సూచనలు

రేపు పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమైన మావోయిస్టులు

ప్రతీకార చర్యలకు ఆస్కారం లేకుండా పెరిగిన పోలీస్‌ పహారా

రంపచోడవరం, నవంబరు 21 (ఆంధ్ర జ్యోతి): అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో హిడ్మా, టెక్‌ శంకర్‌ వంటి కీలక నేతలతో పాటు 13 మంది మావోయిస్టులు మృతిచెందిన నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు మ న్యంలో సంచరించకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా ఆంక్షలు విధించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య హోదాల్లో ఉన్న నేతలెవరూ తమ నివాసాలకు రావొద్దని, మన్యానికి దూరంగా ఎక్కడైనా సురక్షిత ప్రాం తాల్లోనే ఉండిపోవాలని సూచించారు. అంతే కాకుండా వారి,వారి నివాసాల వద్ద నిఘాలను కూడా పెంచారు. వారు ఉండే ప్రాంతాల్లో పహారాను పెంచి భద్రత కల్పిస్తున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సోళ్ల బొజ్జిరెడ్డి, ఎమ్మెల్సీ అనంతబాబుకు ఇక్కడి పరిస్థితులను వివ రించి ఈ మేరకు పోలీసుల తగు సూచనలను చేశారు. అంతేకాకుండా అధికార కూటమి పా ర్టీలకు చెందిన ముఖ్య నాయకలు, కీలక నేత లకు సైతం తగు హెచ్చరికలు చేసి సురక్షి తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ రెండు ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు ఇప్పటికే కీలక ప్రకటనలను చేసి ఈ ఎన్‌కౌం టర్లను ఖండించారు. ఇవి బూటకపు ఎన్‌ కౌంటర్లని, నిరాయుధులుగా ఉన్నవారిని పట్టుకుని తీసుకువచ్చి పోలీసులు కాల్చేశారని ప్రకటనలు విడుదల చేసిన మావోయిస్టులు ఈనెల 23న పెద్ద ఎత్తున నిరసన చేపట్టను న్నారు. ఈ ఎన్‌కౌంటర్లపై వామపక్ష పార్టీలు కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించా యి. ఎదురవుతున్న వ్యతిరేకత, ఆందోళనల నేపథ్యంలో మావోయిస్టుల నుంచి ఏ ప్రతీకార చర్యలకు ఆస్కారం లేకుండా పోలీసులు ఎ క్కడికక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Nov 22 , 2025 | 12:09 AM