తాగిన మైకంలో తాచుపాముతో చెలగాటం
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:09 AM
ముమ్మిడివరం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తాగిన మైకంలో ఓ వ్యక్తి తాచుపాముతో చెలగాటమాడి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. ఈ సంఽఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పరిధిలోని పొట్టితిప్పలో మంగళవారం జరిగింది. పొట్టితిప్పకు చెందిన గొల్లపల్లి వెంకటేశ్వరరావు అలియాస్ కొండ మంగళవారం తాగిన మైకంలో కోడిగుడ్ల కోసం కోళ్లకు ఉంచిన గంప దగ్గరికి వెళ్లి చేయి పెట్టగా గంప కింద ఉన్న తా
కాటేసినా పట్టించుకోకుండా మెడలో వేసుకుని హల్‌చల్
భయభ్రాంతులకు గురైన స్థానికులు
ముమ్మిడివరం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తాగిన మైకంలో ఓ వ్యక్తి తాచుపాముతో చెలగాటమాడి ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. ఈ సంఽఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పరిధిలోని పొట్టితిప్పలో మంగళవారం జరిగింది. పొట్టితిప్పకు చెందిన గొల్లపల్లి వెంకటేశ్వరరావు అలియాస్ కొండ మంగళవారం తాగిన మైకంలో కోడిగుడ్ల కోసం కోళ్లకు ఉంచిన గంప దగ్గరికి వెళ్లి చేయి పెట్టగా గంప కింద ఉన్న తాచుపాము కాటేసింది. అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు ఆ పామును పట్టుకుని నన్నే కరుస్తావా అంటూ మెడలో వేసుకుని హల్‌చల్ చేశాడు. దీంతో స్థానికులు భయ భ్రాంతులకు గురై పామును వదిలేయమని వెంకటేశ్వరరావును హెచ్చరించినా లెక్క చేయకుండా పామును మీ పైకి వదులుతానని దానితో చెలగాటమాడిన క్రమంలో మరోసారి ఆ పాము వెంకటేశ్వరరావును కాటేసింది. స్థానికులు మూకుమ్మడిగా వెంకటేశ్వరరావు నుంచి పాము వేరు చేసి దాన్ని హతమార్చి చికిత్స కోసం వెంకటేశ్వరరావును ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యసేవల నిమిత్తం వెంకటేశ్వరరావును అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.