Share News

ఫోన్‌లో పబ్జీ గేమ్‌ ఆడుకుంటుండగా...

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:58 AM

గండేపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా గండేపల్లి మండలం యర్రంపాలెంలో శుక్రవారం రాత్రి క్షణికావేశంలో ఓ వ్యక్తి యువకుడిపై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యర్రంపాలెంలో కాకర చిన్ని

ఫోన్‌లో పబ్జీ గేమ్‌ ఆడుకుంటుండగా...

యువకుడిపై కత్తితో దాడి

అక్కడికక్కడే మృతి

గండేపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా గండేపల్లి మండలం యర్రంపాలెంలో శుక్రవారం రాత్రి క్షణికావేశంలో ఓ వ్యక్తి యువకుడిపై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యర్రంపాలెంలో కాకర చిన్ని అనే వ్యక్తి కొత్తగా ఇళ్లు కట్టుకుంటున్నాడు. అక్కడే గ్రామానికి చెందిన బొంగా బాబ్జి (17) అనే యువకుడు రాత్రి 11గంటల సమయంలో ఫోన్‌లో పబ్జీ గేమ్‌ ఆడుకుంటున్నాడు. గమనించిన చిన్ని అక్కడి నుంచి వె ళ్లిపోవాలని బాబ్జికి చెప్పాడు. అయినా వినకుండా బాబ్జి అక్కడే ఉండడంతో ఇద్దరి మధ్య మాటామా టా పెరిగింది. దీంతో ఆవేశంలో బాబ్జి పీక మీద చిన్ని కత్తితో దాడి చేయడంతో వెంటనే అతడు అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందు కున్న గండేపల్లి ఎస్‌ఐ యువీ శివనాగబాబు, డీఎస్పీ శ్రీహరిరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీనిపై గండేపల్లి ఎస్‌ఐ కేసు నమోదు చేయగా సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:58 AM