Share News

బాకీ తీర్చేస్తానని పిలిచి.. బావిలోకి తోసేసి!

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:45 AM

గొల్లప్రోలు రూరల్‌, సెప్టెంబరు 17 (ఆంధ్ర జ్యోతి): తీసుకున్న అప్పు తీర్చమన్నందుకు ఇద్దరిని హత్య చేయడమే గాక నూతిలో పడవేసి మరొకరిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జరిగింది. ఈ సంఘటన బుధవారం పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. అసలేం జరిగిందంటే...

బాకీ తీర్చేస్తానని పిలిచి.. బావిలోకి తోసేసి!
గొల్లప్రోలు మండలం తాటిపర్తి పొలాల్లోని బావిలో తేలిన మృతదేహం

ఇద్దరిని చంపిమరొకరిపై హత్యాయత్నం

కాకినాడ జిల్లా తాటిపర్తిలో ఘాతుకం

పోలీసుల అదుపులో నిందితుడు!

గొల్లప్రోలు రూరల్‌, సెప్టెంబరు 17 (ఆంధ్ర జ్యోతి): తీసుకున్న అప్పు తీర్చమన్నందుకు ఇద్దరిని హత్య చేయడమే గాక నూతిలో పడవేసి మరొకరిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జరిగింది. ఈ సంఘటన బుధవారం పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది.

అసలేం జరిగిందంటే...

తాటిపర్తి గ్రామానికి చెందిన రంపం గంగాధ ర్‌ అవసరాల నిమిత్తం తన బంధువులైన రంపం శ్రీను (51), తోరాటి సూరిబాబు (44), కుంపట్ల సూరిబాబు (36) వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో గంగాధర్‌ను చెల్లించాల ని వారు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మం గళవారం రాత్రి 8గంటల సమయంలో రంపం శ్రీను, తోరాటి సూరిబాబుకు గంగాధర్‌ ఫోన్‌ చేసి అప్పు తీర్చేస్తానని, మాట్లాడే పని ఉందని పిలిచి పథకం ప్రకారం గ్రామ శివారుకు తీసుకువెళ్లాడు. అక్కడ పొలాల్లో ఉన్న బావి వద్దకు వెళ్లిన తర్వాత వారిద్దరిని నూతిలోకి తోసేసి హత్య చేశాడు. అనంతరం మరొక వ్యక్తి కుంపట్ల సూరిబాబుకు బాకీ ఇచ్చేస్తానని చెప్పి రమన్నాడు. గంగాధర్‌ సూరిబాబును తన మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని తాటిపర్తి పుంతరోడ్డులోని సుద్దగడ్డ వాగు వద్దకు తీసుకువెళ్లి సెల్‌ఫోన్‌ పడిపోయిందని చెప్పి వెతుకుతున్న ట్టు నటించాడు. అదే సమయంలో సూరిబాబును చంపేందుకు ప్రయత్నించ గా తప్పించుకుని గొల్లప్రోలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. కుంపట్ల సూరిబాబు ఫిర్యాదుపై పిఠాపురం సీఐ శ్రీనివాస్‌ కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడ ఏ ఎస్పీ మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌ సంఘటనా స్థలా న్ని పరిశీలించారు. రంపం శ్రీను కౌలు రైతు కాగా అతడికి భార్య బేబీ, ముగ్గురు కుమారులు ఉన్నారు. తోరాటి సూరిబాబు కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తు న్నాడు. అతనికి భార్య భవానీ, కుమారుడు, కు మార్తె ఉన్నారు.

అప్పిస్తే ప్రాణం తీశాడు..

ఆపదలో ఉన్నాను, సొమ్ములు కా వాలని చెప్పడంతో అప్పు ఇస్తే రం పం గంగాధర్‌ తమ వారి ప్రాణాలు తీశాడని తోరాటి సూరిబాబు, రంపం శ్రీను కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన తాటిపర్తి పరిసర గ్రామాల్లో సంచలనంగా మారింది. పథకం ప్రకారమే గంగాధర్‌ ఈ ఇద్దరిని హత్య చేసినట్టు చెప్తున్నారు. కాగా కేసు దర్యాప్తులో ఉందని, ఆర్థికపరమైన విషయాలే ఈ సంఘటనకు కారణమని ఏఎస్పీ తెలిపారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసు జాగిలాలు నిందితుడు రంపం గంగాధర్‌ ఇంటి వరకూ వెళ్లి ఆగాయి. అయితే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం తెలిసింది.

Updated Date - Sep 18 , 2025 | 12:45 AM