రాత్రి ఇంటిలో నిద్రించి... ఉదయం శవంగా కనిపించి!
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:55 PM
ఉప్పలగుప్తం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉ ప్పలగుప్తం మండలం టి.చల్లపల్లి పంచాయతీ పర్రపేటలో బు
తుఫాన్ గాలులకు వ్యక్తి మృతి
ఉప్పలగుప్తం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉ ప్పలగుప్తం మండలం టి.చల్లపల్లి పంచాయతీ పర్రపేటలో బుధవారం ఉదయం ఈతకోట శ్రీరాములు (73) తన ఇంటి ముందే తోటలో శవమై కన్పించాడు. మంగళవారం రాత్రి శ్రీరాములు తన గదిలో పడుకున్నాడు. అర్థరాత్రి మూత్ర విసర్జన నిమిత్తం బయటకు వచ్చి తుఫాను గాలుల బీభత్సానికి మృతిచెందినట్టు కుటుంబసభ్యులు చెప్తున్నారు. అయితే ఈ విషయంపై పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు గ్రామ సర్పంచ్ ఇసుకపట్ల జయమణీరఘుబాబు తెలిపారు.