Share News

మహిళపై మెయిల్‌ నర్స్‌ అకృత్యాలు

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:40 AM

జీజీహెచ్‌(కాకినాడ) ఆగస్టు 24 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జీజీహెచ్‌లో మెయిల్‌ నర్స్‌గా పనిచేస్తున్న సందీప్‌ అనే వ్యక్తి ఓ మహిళపై అకృత్యాలకు పాల్పడాడు. అతడు చేస్తున్న దారుణాలపై ఆ మహిళ ఆదివారం సాయంత్రం కాకి నాడ వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన ట్టు సీఐ ఎం.నాగదుర్గా

మహిళపై మెయిల్‌ నర్స్‌ అకృత్యాలు

తనతో ఉండాలని వేధింపులు

ఫొటోలను మార్ఫింగ్‌ చేసి

బాధితురాలి కొడుక్కి పంపిన వైనం

కాకినాడ వన్‌టౌన్‌ పీఎస్‌లో కేసు

జీజీహెచ్‌(కాకినాడ) ఆగస్టు 24 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జీజీహెచ్‌లో మెయిల్‌ నర్స్‌గా పనిచేస్తున్న సందీప్‌ అనే వ్యక్తి ఓ మహిళపై అకృత్యాలకు పాల్పడాడు. అతడు చేస్తున్న దారుణాలపై ఆ మహిళ ఆదివారం సాయంత్రం కాకి నాడ వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన ట్టు సీఐ ఎం.నాగదుర్గారావు తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారురాలి భర్త కొంతకాలం క్రితం మరణించాడు. ఆమె మనోవేదనకు గురైన సమయం లో కాకినాడ జీజీహెచ్‌లో మెయిల్‌ నర్సుగా పని చేస్తున్న సందీప్‌ దగ్గరయ్యాడు. సహజీవనం పేరుతో ఆమెతో చనువు పెంచుకున్నాడు. నాటి నుంచి బాధితురాలికి తెలియకుండా స్నానం చేస్తునప్పుడు ఫోటోలు, వీడియోలు తీసి భద్రపర్చుకున్నాడు. ఆ ఫొటోలను అడ్డుపెట్టుకుని తన భార్యకు విడాకులు ఇస్తున్నానని, ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు. అప్పటికే సం దీప్‌ స్త్రీలోలుడని, దురలవాట్లు ఉన్నవాడని గుర్తి ంచిన మహిళ తనకు ఇష్టం లేదని తెగేసి చెప్పి ంది. దీంతో సందీప్‌ దాచిపెట్టుకున్న ఫొటోలతో పాటు మరికొన్ని ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఆమెకే పంపాడు. ఆమె ప్రశ్నించగా తనతో ఉం టే ఫొటోలు ఎవరికి పంపనని లేదా సోషల్‌ మీడియాలో పెడతానని చెప్పాడు. బాధితురాలు లొంగకపోయేసరికి బంధువులందరికీ ఆ ఫొటోలను పంపాడు. ఆమె నుంచి ఏ స్పందన లేకపోయేసరికి శనివారం రాత్రి ఆ ఫొటోలను బాధితురాలి కొడుకైన మైనర్‌ బాలుడికి పంపించాడు. ఫోన్‌ చేసి మరీ బాలుడికి చెప్పాడు. బాలుడు ఫొటోలు చూసి మనస్తాపం చెందాడు. శనివా రం రాత్రి ఆ బాలుడు ఇంటి నుంచి బయటకు వచ్చేసి నేను తట్టుకోలేకపోతున్నాను బ్రతకనని చెప్పి వెళ్లిపోయాడు. బంధువులు ఆ బాలుడి కోసం గాలించి ఆదివారం గుర్తించారు. సందీప్‌ అకృత్యాలు తాళలేకపోయిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. రాష్ట్ర మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. వన్‌టౌన్‌ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశాడు. సందీప్‌ పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగదుర్గారావు తెలిపారు.

Updated Date - Aug 25 , 2025 | 12:40 AM