Share News

నమో నారసింహ..

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:40 AM

అంతర్వేది, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): కోరిన కోర్కెలు తీర్చే శ్రీకర శుభకర ప్రణవస రూపుడు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి. ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్‌ నేపథ్యంలో రాజోలు నియోజకవర్గాన్ని, అంతర్వేది పరిసర ప్రాంతాలను కాపాడిన సందర్భంగా అంతర్వేదిలో మంగళ వారం మహాశాంతి హోమం వైభవంగా నిర్వహి ంచారు. లక్ష్మీనరసింహస్వామికి భక్తి శ్రద్ధలతో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసా

నమో నారసింహ..
మహాశాంతి హోమం నిర్వహిస్తున్న అర్చకులు

అంతర్వేదిలో వైభవంగా మహాశాంతి హోమం

వేలాదిగా పాల్గొన్న భక్తులు

అంతర్వేది, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): కోరిన కోర్కెలు తీర్చే శ్రీకర శుభకర ప్రణవస రూపుడు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి. ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్‌ నేపథ్యంలో రాజోలు నియోజకవర్గాన్ని, అంతర్వేది పరిసర ప్రాంతాలను కాపాడిన సందర్భంగా అంతర్వేదిలో మంగళ వారం మహాశాంతి హోమం వైభవంగా నిర్వహి ంచారు. లక్ష్మీనరసింహస్వామికి భక్తి శ్రద్ధలతో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌, కూటమి శ్రేణుల నేతృత్వంలో హోమాన్ని చేపట్టారు. అశేష భక్తజన సంద్రంతో పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు, అయ్యప్పస్వాములు, భవానీ మాలధరించిన భక్తులు, క్షేత్రానికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు కాలినడకన పుణ్యక్షేత్రానికి చేరుకుని స్వామివారికి పాదాభివందనాలు చేస్తూ మొక్కారు. తొలుత స్వామిని అర్చకులు, ఆలయ అధికారులు శాస్ర్తోక్తంగా ప్రధాన గోపురం ఎదురుగా ఉన్న కల్యాణ మండపంలో ప్రత్యేక సింహాసనంపై ఆశీనులుచేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక హోమశాలలో శాంతి హోమాన్ని నిర్వహించి నృసింహ, గోవింద నామస్మరణల మధ్య మహశాంతి హోమం, పూర్ణాహుతి వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌, ఆలయ ఫౌండర్‌, ఫ్యామిలీ మెంబర్‌, చైర్మన్‌ కలిదిండి కుమారరామగోపాలరాజాబహుదూర్‌, ఆలయ ప్రధానార్చకుడు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్‌ పూర్ణాహుతిలో పూజా ద్రవ్యాలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. తూర్పు, పశ్చిమ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు మహాశాంతిహోమాన్ని తిలకించారు. పూజా ద్రవ్యాలు హోమ గుండంలో వేసి స్వామిని దర్శించుకున్నారు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం కార్తీకమాసంలో చేపట్టడంతో హర్షం వ్యక్తం చేసి నిర్వహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏసీ ఎంకేటీఎన్వీ ప్రసాద్‌, గుండుబోగుల పెద్దకాపు, గెడ్డం మహలక్ష్మిప్రసాద్‌, కేతా వెంకటలక్ష్మి, ఆకన బాబ్జినాయుడు, పినిశెట్టి బుజ్జి, మాలే శ్రీనివాసనగేష్‌, గుబ్బల ఫణికుమార్‌, దిరిశాల బాలాజీ, ముప్పర్తి నాని, బైరా నాగరాజు, పోతురాజు కృష్ణ, తిరుమాని ఆచార్యులు, సర్పంచ్‌లు కొండా జాన్‌బాబు, పోతురాజు కిశోర్‌, ఒడుగు శ్రీను, ఎంపీటీసీలు చొప్పల బాబూరావు, బైరా నాగరాజు, దాసరి వాసు, పిండి సత్యనారాయణ, వనమాలి మూలాస్వామి పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 12:40 AM