మహానాడు జోష్
ABN , Publish Date - May 20 , 2025 | 12:44 AM
టీడీపీలో మహానాడు జోష్ పెరిగింది. ఇప్ప టికే సంస్థాగత ఎన్నికలతో జోరు పెంచిన నేత లు ఇక మహానాడుపై దృష్టి పెట్టారు.
కేడర్‌లో ఉప్పొంగుతున్న ఉత్సాహం
3 నియోజకవర్గాల్లో నిర్వహణ
నేడు మూడు చోట్ల అమలు
22న రాజానగరంలో ఏర్పాట్లు
కమిటీల నియామకంపై కసరత్తు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
టీడీపీలో మహానాడు జోష్ పెరిగింది. ఇప్ప టికే సంస్థాగత ఎన్నికలతో జోరు పెంచిన నేత లు ఇక మహానాడుపై దృష్టి పెట్టారు. ఈ నెల 27,28,29వ తేదీల్లో కడపలో టీడీపీ మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ మహానాడుకు జిల్లా నుం చి నియోజకవర్గాల వారీ తరలివెళ్లడానికి పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. మహానాడు నిర్వహణకు ముందు సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయడం టీడీపీ ఆనవాయితీ. మొత్తం కమిటీల పూర్తి చేసిన తర్వాత మహానాడులో పార్టీ అధ్యక్షుడిని లాంఛనంగా ఎన్నుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 14 నుంచి కుటుంబ సాధికారిత సారఽథుల నియామకంతో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తర్వాత బూత్, గ్రామ, మండల, పట్టణ, డివిజన్, నియోజకవర్గ, పార్లమెంట్ పరిధి కమిటీలతో పాటు, వాటి అనుబంధ కమిటీల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి సిటీ, రూరల్‌లో ఇంచుమించు కమిటీలను నియమిం చారు. కమిటీల నియా మకంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ య్యచౌదరి ముందంజలో ఉన్నారు. సిటీలో మొదటగా మినీ మహానాడు నిర్వహించారు. అనపర్తిలో నల్లమిల్లి మనోజ్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీల నియామకం జోరందుకుంది. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్ రెడ్డి టీడీపీ కన్వీనర్‌గా ఉన్నారు. అన పర్తి, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల మినీ మహానాడు సోమవారం నిర్వహించారు. నిడదవోలు, గోపాలపురం,కొవ్వూరు నియోజకవ ర్గాల పరిధిలో మంగళవారం మినీ మహానాడు నిర్వహించనున్నారు. రాజానగరం నియోజకవర్గ మినీ మహానాడు ఈ నెల 22వ తేదీన జర గనుంది. రాజానగరంలో సంస్థాగత ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ ఇన్‌చార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి ఉన్న సంగతి తెలిసిందే. కానీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.ఆయన కుమారుడు అభిరామ్ కూడా ఇక్కడ పార్టీలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.మాజీ ఎమ్మెల్యే బూరు గుపల్లి శేషారావుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యా భివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి లభిం చడం తో నిడదవోలు టీడీపీలో ఉత్సాహం పెరిగింది. కొవ్వూరులో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం మినీ మహానాడు నిర్వహిస్తారు.గోపాలపురంలో ఎమ్మెల్యే మద్ది పాటి వెంకట్రాజు ఆధ్వర్యంలో చాలా వరకూ కమిటీల నియామకం పూర్తయింది.ప్రధాన కమి టీలను ప్రకటించాల్సి ఉంది. మంగళవారం మినీ మహానాడు జరగనుంది. జిల్లాలో సం స్థాగత ఎన్నికలకు సంబంధించి చాలా చోట్ల పాతనేతలకే పదవులు దక్కగా కొద్దిగా కొత్త ముఖాల ప్రాధాన్యత ఇచ్చారు. అయితే టీడీపీకి పూర్వం నుంచి అభిమానులుగా ఉన్న చాలా కులాలకు కనీస ప్రాధాన్యత ఇచ్చి, పార్టీని మరింత బలోపేతం చేసుకుందామనే ఆలోచన నేతలకు లేకపోవడం సమస్యగా మారింది.