Share News

స్వర్ణ శోభితం... మహాశక్తి యాగం

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:45 AM

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 26 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం శుక్రవారం ఐదో రోజుకు చేరుకుంది. అయోధ్య నుంచి తెచ్చిన బంగారు కల్యాణ రాముని విగ్రహం, బంగారు పాదుకలు, బంగారు ధనుర్భాణాన్ని వీక్షించి భక్తులు పులకించారు. వంద కోట్ల లలితా సహ స్రనామ కుంకుమార్చన

స్వర్ణ శోభితం... మహాశక్తి యాగం
అయోధ్య శ్రీరాముని విగ్రహం, ధనుర్భాణం

కల్యాణ రాముని ఉత్సవ విగ్రహం, బంగారు పాదుకలు, బాణం ప్రదర్శన

వీక్షించిన వేలాది మంది భక్తులు

60 కోట్లకు చేరిన లలితా సహస్రనామ కుంకుమార్చనలు

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 26 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం శుక్రవారం ఐదో రోజుకు చేరుకుంది. అయోధ్య నుంచి తెచ్చిన బంగారు కల్యాణ రాముని విగ్రహం, బంగారు పాదుకలు, బంగారు ధనుర్భాణాన్ని వీక్షించి భక్తులు పులకించారు. వంద కోట్ల లలితా సహ స్రనామ కుంకుమార్చన 60కోట్లకు చేరింది. సామూహిక కుం కుమ పూజలు ని ర్వహించారు. శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూ ర్ణానంద భక్తులకు అనుగ్రహభాషణ చేశారు. మొదటిసారి మహాశక్తి యాగానికి శ్రీరాముడు పాదుకలు రాగా రెండోసారి ధను ర్భాణాలు వచ్చాయన్నారు. ఇప్పుడు బంగారు రాముడు, ఆయుధాలు రావడం యాధృచ్ఛి కమన్నారు. మంత్రం ఫలించాలంటే మనసు ప్రధానమని, భావం దృఢంగా ఉంటే మంత్రం చెప్పకపోయినా ప్రకృతి దానికి సహకరిస్తుంద న్నారు. అయోధ్యలో రూ.200 కోట్లతో కల్యాణ రాముడు గుడి నిర్మిస్తున్నామని, ఈ విగ్రహ శంకుస్థాపనకు స్వామీజీని ఆహ్వానిస్తున్నట్టు అయోధ్యకు చెందిన చల్లా శ్రీనివాసశాస్త్రి తెలి పారు. తెలుగువాళ్ల కోసం వసతి, ఉచిత భోజ నం అమలు చేస్తున్నామన్నారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ దుర్గాసూక్త, ప్రత్యంగిర హోమాలు నిర్వహిం చారు. అయోధ్య నుంచి తీసుకువచ్చిన బంగా రు కల్యాణరాముని ఉత్సవ విగ్రహం, పాదు కలు, కోదండం, ధనుర్భాణం ప్రదర్శించారు. 50వేల మంది భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. సర్పవరం సీఐ బి.పెద్దిరాజు, ట్రాఫిక్‌ సీఐ రామారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు పి.శ్రీనివాసకుమార్‌, ఆచార్యులు, రత్నం, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Sep 27 , 2025 | 12:45 AM